
ప్రపంచమంతా నాటు నాటు అనే పాటకు ఉర్రూతలూగిపోతుంటే ఆ పాటకు సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మాత్రం చెత్త పాట అంటూ దారుణమైన విమర్శలు చేస్తున్నాడు. నాటు నాటు పాటను మొత్తం చెడగొట్టాడు కీరవాణి. అదేం పాట ….. చంద్రబోస్ ఇప్పటి వరకు 5 వేల పాటలు రాసాడట ….. అన్ని పాటల్లోకెల్లా ఇదే చెత్త పాట అయి ఉంటుంది. అలాగే కీరవాణి ఇప్పటి వరకు ఎన్నో మంచి పాటలకు సంగీతం అందించాడు ……. ఈ పాట మాత్రం చెత్త పాట అంటూ ఘాటు విమర్శలు చేసాడు శివశక్తి దత్తా.
కీరవాణి తండ్రి పలు సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించాడు. అలాగే ఓ సినిమాను కూడా నిర్మించాడు అప్పట్లో. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అలాగే ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమాకు పెట్టిన పెట్టుబడి కోసం తన 300 ఎకరాలు అమ్మేసాడట. దాంతో అప్పుల పాలు అయ్యింది శివశక్తి దత్తా – విజయేంద్ర ప్రసాద్ కుటుంబం.
కట్ చేస్తే చిన్నప్పటి నుండే కీరవాణి కష్టపడుతూ కుటంబాన్ని పోషించాడు. ఇక రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభించాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడిగా యావత్ ప్రపంచాన జెండా ఎగురవేశాడు. ఇక ఇప్పుడేమో నాటు నాటు అనే పాట యావత్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తోంది ఆస్కార్ దక్కడంతో. అయితే ఈ పాట మాత్రం చెత్తగా ఉందని , పాటను కీరవాణి చెడగొట్టాడని , చంద్రబోస్ చెత్తగా రాసిన పాట అంటూ తన అభిప్రాయం చెప్పడంతో జనాలు షాక్ అవుతున్నారు. అయితే కీరవాణి ,చంద్రబోస్ లు ఇన్నేళ్ళుగా కళామతల్లికి చేసిన సేవకు గాను ఆస్కార్ దక్కిందంటూ చెప్పడం కొసమెరుపు.