22.2 C
India
Saturday, February 8, 2025
More

    డిసెంబర్ 31 న అంగరంగ వైభవంగా న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెపుతూ వాకింగ్ స్ట్రీట్ విత్ రాహుల్ సిప్లిగంజ్ “NYE 2023” మ్యూజికల్ ఈవెంట్

    Date:

    Walking Street with Rahul Sipliganj welcomes the New Year with grandeur on December 31
    Walking Street with Rahul Sipliganj welcomes the New Year with grandeur on December 31

    న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ద్వారా హైదరాబాద్ ప్రేక్షకులలో, సంగీత ప్రేమికులలో జోష్ నింపేందుకు రాహుల్ సిప్లిగంజ్ ఈ నెల 31 న, 2022 కు వీడ్కోలు చెపుతూ 2023 కి వెల్ కమ్ చెప్పేందుకు వా కింగ్ స్ట్రీట్ విత్ రాహుల్ సిప్లిగంజ్ “NYE 2023” పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ ను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి సిద్దమయ్యారు. ఈ ఈవెంట్ లో ఎంతో మంది టాప్ సింగర్స్ పాల్గొంటారు. ఈ మ్యూజిక్ ఫెస్ట్ లో మెలోడీ, మాస్ పాటలు ఇలా అన్ని రకాల పాటలను కవర్ చేస్తూ లైవ్ పెర్ఫార్మన్స్ ప్రదర్శించి సంగీత ప్రియులను ఊర్రూతలూగించ నున్నారు.ఈ సందర్బంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ డిసెంబర్ 31 న జరగబోయే ఈవెంట్ కు టికెట్స్, మరియు పోస్టర్స్ ను లాంచ్ చేయడం జరిగింది.

    అనంతరం సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ..
    ప్రాపర్ తెలంగాణ స్టైల్లో చార్మినార్ థిమ్ బ్యాక్ గ్రౌండ్ తో 1000 మెంబెర్స్ కెపాసిటీ తో మాదాపూర్ లో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాము. ఈ ఈవెంట్ కోసం నేను ఎంతో ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాను. ఇందులో మాక్కి కిరికిరి నుండి నాటు నాటు వరకు అన్ని పాటలు ఇందులో ఉంటాయి.నేను పాడిన పాటలను అదిరించి పెద్ద సింగర్ ని చేసిన ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు. అలాగే నాటు నాటు సాంగ్ ఇంటర్నేషనల్ లెవల్ లో ఇచ్చే గోల్డెన్ గ్లోబ్ కు నామినేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.

    డిసెంబర్ 31 న జరిగే ఈ కార్యక్రమం లో చాలా ఎనర్జీటిక్ పాటలు ఉంటాయి.ఒక్క ముక్కలో చెప్పాలి అంటే రాహుల్ సిప్లిగంజ్ నుండి ఎలాంటి పాటలు కావాలని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ సాంగ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. వచ్చిన వారు ఎక్కడా బోర్ ఫీలవ్వరు. ఇంతకముందు శిల్పకళావేదికలో చేసిన ఫస్ట్ టైం ఈవెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు మేము పాడిన పాటలకు చాలా మంది సీట్లలో నుండి లేచి డ్యాన్సులు వేశారు. ఆ షో కు అంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.

    ఇప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది . ఎంట్రీ టికెట్స్ కూడా స్టార్ ఎంట్రీ, స్టాగ్ ఎంట్రీ 1500, కపుల్ ఎంట్రీ 2,000 ఇలా అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. ఈ కార్యక్రమం అంతా గవర్నమెంట్ పర్మిషన్ తో కోవిడ్ నిబంధనలతో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి మా ఈవెంట్ ను సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

    Share post:

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    interest rates : లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    interest rates : ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ...

    EV Buses : హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు: టికెట్ ధర రూ. 99 మాత్రమే!

    EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rahul sipligunj : కాంగ్రెస్ స్కెచ్ అదిరింది.. గోషామహల్ బరిలో ఆస్కార్ విన్నర్..

    Rahul sipligunj : ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి....

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    కాలభైరవ ట్వీట్ పై ఎన్టీఆర్ , చరణ్ ఫ్యాన్స్ ఫైర్

    నాటు నాటు పాట ఆస్కార్ వేదిక మీద పాడే అవకాశం రావడానికి...