
2022 కు గుడ్ బై చెబుతూ 2023 కు సుస్వాగతం అంటూ యువత పెద్ద ఎత్తున పండగ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఇక హైదరాబాద్ లో కూడా అదే జోష్ మొదలైంది. న్యూ ఇయర్ కు మరో 10 రోజులు కూడా లేదు దాంతో పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
అదే కోవలో ఇప్పుడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా న్యూ ఇయర్ ఈవెంట్ కు రంగం చేసుకుంటున్నాడు. హైదరాబాద్ మాదాపూర్ లోని Habibi Mandi Restaurant లో ఈ వేడుకలు జరుగనున్నాయి. దాంతో డిసెంబర్ 21 న ఈ రెస్టారెంట్ లో టికెట్ అండ్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ” Walking Street With Rahul Sipligunj NYE 2023 ” పేరిట ఈ ఈవెంట్ జరుగనుంది. రాహుల్ సిప్లిగంజ్ సింగర్ గా ఎంతటి సంచలనం సృష్టించాడో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు …… పలు చిత్రాల్లో బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడిన విషయం తెలిసిందే.