
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U / A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఇక ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు పండక్కి బ్లాక్ బస్టర్ కొట్టేసారు పో ……. అన్నారట సింపుల్ గా. అంటే ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు ఇది రొటీన్ ఫిలిం అయినప్పటికీ ఫుల్ మీల్స్ అని అభిమానులను , ప్రేక్షకులను అందరినీ అలరించడం ఖాయమని చెప్పారట.
సినిమా కథ రొటీన్ అయినప్పటికీ సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడ కూడా బోర్ లేదని , మంచి ఎంటర్ టైనర్ అని అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ , పాటలు , నేపథ్య సంగీతం సినిమాను మరో లెవల్ లో నిలబెట్టాయని అంటున్నారు. ఇక వీటికి చిరంజీవి మాస్ అప్పియరెన్స్ రవితేజ పవర్ ఫుల్ రోల్ , శృతి హాసన్ అందాలు వెరసి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని అంటున్నారు.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. జనవరి 13 న వాల్తేరు వీరయ్య చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. చిరంజీవి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వాల్తేరు వీరయ్య కు పాజిటివ్ టాక్ వచ్చిందని తెలిస్తే ఇక వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవనే చెప్పాలి.