
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటించింది. కేథరిన్ ట్రెసా , ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది అయితే రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ గా ఉండటంతో ఫ్రాన్స్ లో ఒక పాట అందమైన లొకేషన్ లలో చిత్రీకరించారు ఓటీవలె. ఆ పాటకు సంబంధించిన అందమైన లొకేషన్ లను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కొన్ని సీన్స్ షూట్ చేసి వాటిని అభిమానుల కోసం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే …….. సినిమా నిడివి మొత్తంగా 2 గంటల 35 నిముషాలు ఉండేలా ప్లాన్ చేశారట. ఇప్పటివరకు రెండు పాటలు మినహా మిగదంతా లాక్ అయిపోయింది కాబట్టి ఓవరాల్ గా 2 గంటల 35 నిముషాలు వస్తోందట. ఈ రన్ టైం అంటే మంచిదే అన్నమాట. యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిచారట. ఇక ఈ సినిమాను 2023 జనవరి 13 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.