
స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ స్టైల్ కొంతకాలంగా చాలా మారిపోయింది. ఒకప్పుడు వెంటవెంటనే సినిమాలు చేసుకుంటూ వెళ్లే ఆయన.. దశాబ్దకాలంగా తన పంథా మార్చుకున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు. అలా రుద్రమదేవి సినిమా కోసం కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాడు. ఆ తర్వాత రానా హీరోగా హిరణ్య కశిప సినిమాకు అన్ని సిద్దం చేసుకున్నాడు కానీ.. అనివార్య కారణాలతో అది ఆగిపోయింది. దీంతో మళ్లీ చాలా కాలం తర్వాత..`శాకుంతలం` సినిమా మొదలుపెట్టి.. మొత్తానికి పూర్తి చేశాడు. అతి త్వరలోనే ఇది రిలీజ్ కు సిద్దమవుతోంది. అయితే ఈ సినిమా తర్వాత గుణశేఖర్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రుద్రమదేవి, హిరణ్యకశిప, శాకుంతలం ఇలా .. ఇదే జానర్ కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తారా లేదా కమర్శియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నార అన్నదానిపై అందరిలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. వాస్తవానికి గుణశేఖర్ స్టార్ హీరోలతో సినిమా చేసి దశాబ్ధం దాటింది. ఆయన చివరిగా చేసిన కమర్షియల్ మూవీ నిప్పు. రవితేజ హీరోగా తెరకెక్కించాడు కానీ అది అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత స్టార్ సినిమాలతో సినిమాలు చేసేంది లేదు.
గతంలో గుణశేఖర్ నుంచి భారీ బ్లాక్ బస్టర్లు వచ్చాయి. చూడాలని ఉంది, ఒక్కడు, సైనికుడు, అర్జున్ వంటి సినిమాలు చేసిన ఆయన.. ఇలా రూట్ మార్చడం చాలా మందికి నిరాశను కలిగిస్తోంది. అయితే భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ గా మారిన ఆయన… ఇప్పటి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అయితే శాకుంతలం తర్వాత ఆయన నుంచి అలాంటి సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఓ సెక్షన్ ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఏం చేస్తాడో