హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో డార్లింగ్ ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హర్రర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. హర్రర్ కామెడీ అంటే మారుతికి ఇష్టం. పైగా హర్రర్ కామెడీ నేపథ్యంలో ఇంతకుముందు ప్రేమ కథా చిత్రం అనే బ్లాల్ బస్టర్ తీసాడు. అయితే ప్రభాస్ ని పెట్టి కేవలం హర్రర్ , కామెడీ పెడితే బాగుండదు కాబట్టి కాస్త మసాలా జోడించి యాక్షన్ తో కలగలిపి చిత్రీకరిస్తున్నారు.
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. దాంతో ఇది రిస్క్ అనే చెప్పాలి. కాకపోతే రిస్క్ చేయకుంటే బ్లాక్ బస్టర్ దొరకదు కదా …… అందుకే రిస్క్ చేస్తున్నాడు. అలాగే మారుతి చాలా కాలంగా ప్రభాస్ తో అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. బన్నీ ఛాన్స్ ఇవ్వలేదు కానీ డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఛాన్స్ ఇచ్చాడు. మరి డార్లింగ్ ఇచ్చిన అవకాశాన్ని మారుతి సద్వినియోగం చేసుకుంటాడా ? లేదా ? అన్నది చూడాలి.