
సమంత.. ఎప్పుడు ఏదో ఒక న్యూస్ తో హెడ్ లైన్స్ లో ఉంటుంది. సినిమాలతో పాటు పర్సనల్ విషయాలపై ఎప్పుడు బిగ్ డిబెట్ నడుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా… సైలెంట్ గా ఉన్నా చర్చకు దారితీస్తోంది. ఇక జిమ్ లో కుస్తి పడే వీడియోలతో పాటు ఫ్రెండ్స్ తో వెకేషన్ ట్రిపుకు సంబంథించిన ప్రతి పిక్ వైరల్ గా మారుతోంది. అయితే రీసెంట్ గా బ్యూటీని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కొంటెగా సమాధానం చెప్పి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది బ్యూటీ
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలతో బిజీగా మారిపోయింది సమంత. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న టైంలో మయోసైటిస్ బారి పడి… కోలుకుంది. ప్రజెంట్ బాలీవుడ్ లో సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటించడంతో పాటు విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ చేస్తోంది.అదే సమయంలో సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడు టచ్ ఉంటుంది. అయితే ఓ అభిమాని సమంతకు ఓ షాకింగ్ సలహా ఇవ్వగా సామ్ చేసిన అన్సర్ చర్చినీయాంశంగా మారింది.
ఒంటరిగా ఉండటం కంటే.. ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు కదా అని అడ్వైజ్ చేశాడు ఓ నెటిజన్. దానికి బ్యూటీ అదిరిపోయే రేంజ్ లో రిప్లై ఇచ్చింది. తనను ఎవరు ప్రేమిస్తారంటూ ఎదురు ప్రశ్న వేసింది. అంతేకాక మీ అంతలా నన్ను ఎవరు ప్రేమిస్తారంటూ హార్డ్ సింబల్ షేర్ చేసింది. ఈ సమాధానం తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది సామ్. సమంత ఇచ్చిన షార్ప్ రిప్లైక్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది. సామ్ నటించిన శాంకుతలం త్వరలో రిలీజ్ కానుంది. ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకుంది.