Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రచారం ఊపందుకుంది. పార్టీల మధ్య పరస్పర దూషణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ మీద ఆరోపణలు చేయడానికి, అభాండాలు వేయడానికి జనసేన నుంచి బయటకు వెళ్లిన పోతిన మహేష్ కు డబ్బులిచ్చి ఆశ చూపినట్టు తెలుస్తోంది. అతడు పవన్ మీద పరస్పర ఆరోపణలు చేయడానికే నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ప్రతి విషయంలో పవన్ కల్యాణ్ పై ఎదురు దాడి చేస్తున్నాడు.
పవన్ కల్యాణ్ ను ఎదుర్కోవడానికి మహేష్ ను వాడుకుంటున్నారు. అతడి స్క్రీన్ ప్లే మొత్తం సజ్జన కనుసన్నల్లోనే జరుగుతోందని తెలుస్తోంది. ఎవరీ మహేష్. జనసేన పార్టీ లేకపోతే ఎవరికైనా తెలిసే వాడా? జనసేన అవకాశం ఇవ్వడంతోనే అందరికీ పరిచయమయ్యాడు. ఇప్పుడు అదే పార్టీని తిడుతూ వార్తల్లోకి ఎక్కుతున్నాడు.
పవన్ కల్యాణ్ భార్య ప్రస్తావన తీసుకొచ్చి తన మీద తానే బురద జల్లుకున్నాడు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావుండొద్దని తెలిసినా పవన్ భార్య గురించి మాట్లాడి వివాదానికి తెరతీశాడు. వైసీపీ వాళ్లు పట్టుబట్టి పవన్ పై దాడి చేయిస్తున్నారనే తెలుస్తోంది. కానీ మహేష్ పవన్ కల్యాణ్ ను తిట్టడం వల్ల ఎవరికి నష్టం? మహేష్ అమ్ముడుపోయి ఇదంతా చేస్తున్నాడని చెబుతున్నారు.
రాజకీయాల్లో వాడుకుని వదిలేస్తారు. ఈపాటికే చాలా మందిని వాడుకుని పక్కన పెట్టేశారు. వారు పనికి రాని స్క్రాప్ గా మిగిలిపోయారు. ఇప్పుడు మహేష్ కూడా అదే జాబితాలోకి వస్తాడు. కానీ తెలుసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ ను నేరుగా ఎదురుకోలేక అనైతిక రాజకీయాలకు పాల్పడటం వివాదాస్పదం అవుతోంది. దీంతో మహేష్ రాజకీయం ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు.
పోతిన మహేష్ భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. పవన్ కల్యాణ్ ను పదేపదే తిడుతూ ప్రాచుర్యం పొందాలని అనుకోవడం అతడి అనైతికతకు నిదర్శనం. ఈనేపథ్యంలో మహేష్ తిట్ల దండకం ఎక్కడకు వెళ్తుందో తెలియడం లేదు. ఆకాశం ఉమ్మెస్తే మనమీద పడుతుందనే నానుడి అతడికి తెలియలేదని తెలుస్తోంది.