35.1 C
India
Sunday, April 28, 2024
More

    ACTOR CHANDRA MOHAN: కృష్ణంరాజు నిజమైన రారాజు : చంద్రమోహన్

    Date:

    actor-chandra-mohankrishnam-raju-is-the-real-king-chandra-mohan
    actor-chandra-mohankrishnam-raju-is-the-real-king-chandra-mohan

    రెబల్ స్టార్ కృష్ణంరాజు నిజమైన రారాజు అంటూ కీర్తించారు సీనియర్ నటులు చంద్రమోహన్. తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటులు చంద్రమోహన్. హీరోగా , హాస్య నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించిన నటులు చంద్రమోహన్. ఇక చంద్రమోహన్ పక్కన హీరోయిన్ గా నటిస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతారు అనే సెంటిమెంట్ బలంగా ఉండేది అప్పట్లో. అది సెంటిమెంట్ మాత్రమే కాదు సుమా ! నిజం కూడా . చంద్రమోహన్ సరసన నటించిన పలువురు హీరోయిన్ లు ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ లుగా తెలుగునాట ప్రభంజనం సృష్టించారు.

    తాజాగా సీనియర్ నటులు  చంద్రమోహన్ JSW & JaiSwaraajya కోసం కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా ఇటీవల పరమపదించిన రెబల్ స్టార్ కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజు నిజంగానే రారాజు అని , ఆయనతో నేను ఎక్కువ సినిమాలు చేయలేదు కానీ చేసిన సినిమాల వరకు మాత్రం నాకు సంతృప్తి ఉంది. అలాగే ఆయన ఎక్కడుంటే అక్కడ అందరినీ ఒక చోటకు చేర్చి ఇంటి దగ్గరనుండి తీసుకొచ్చిన రకరకాల వంటకాలను నటీనటులందరికీ వడ్డించే ఏర్పాటు చేసేవారు. ఆ విషయంలో ఆయన్ని మించిన రాజు లేడంటే అతిశయోక్తి కాదు.

    ఇక ఇప్పటి హీరోలైన ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ తదితర హీరోలతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్లతో కలిసి పలు చిత్రాల్లో నటించాను. పెద్దలంటే గౌరవ భావం ఉన్న హీరోలు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు సీనియర్ నటులను ఇంటర్వ్యూ చేయడం , వాళ్ళను గౌరవించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ JSW & JaiSwaraajya అధినేతలు జగదీశ్ యలమంచిలి , డాక్టర్ శివకుమార్ ఆనంద్ లను అభినందించారు చంద్రమోహన్.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandramohan Interview : డా. జై, ఆనంద్ గారులతో చంద్రమోహన్ చివరి ఇంటర్వ్యూ వీడియో

    Chandramohan Interview : నటుడు చంద్రమోహన్ మరణం టాలీవుడ్ లో విషాదం...

    నువ్ హీరో అయితే నేను హీరోయిన్ గా చేస్తానంటున్న సుధ

    బావా ...... నువ్ హీరోగా నటిస్తే ..... నేను హీరోయిన్ గా...

    100 కోట్ల ఆస్థి పోగొట్టుకున్నానంటూ బోరుమన్న చంద్రమోహన్

    శోభన్ బాబు ఎంత చెబుతున్నా వినకుండా హైదరాబాద్ , చెన్నై లలో...