41.2 C
India
Sunday, May 5, 2024
More

    ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ భారీ విగ్రహం.. ఆవిష్కరించనున్న జూనియర్ ఎన్టీఆర్

    Date:

    ntr
    ntr

    నందమూరి తారక రామారావు. ఈ పేరుకు తెలుగు రాష్ర్టాలు అంతెందుకు దేశంలోనే పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎంతో కీర్తి సంపాదించిన ఆయన ఇటు సినిమారంగాన్ని అంటు రాజకీయ రంగాన్ని ఏన్నో ఏళ్లు ఏలిన మహానుభావుడు. వేటగాడు లాంటి చిత్రాలతో చిత్రాలను మలుపుతిప్పడంతో పాటు రూ.2 కే కిలో బియ్యం అంటూ ప్రకటించి దేశ రాజకీయాలను కూడా ఒక మలుపుతిప్పారు. ఈయన ఇదొక్కటే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. హీరోగా ఉన్న సమయంలో కరువు ప్రాంతాలను ఆదుకునేందుకు విరాళాలు సేకరించారు.

    తెలుగు రాష్ర్టాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు లేని పట్టణాలు లేవంటే సందేహం లేదు. చాలా చోట్ల కనీసం చిన్న విగ్రహమైనా ఆయనది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని చాలా చోట్ల పంచకట్టుకొని, కండువా వేసుకొని ఉన్నది చూస్తాం. కానీ ఈ విగ్రహం ఆయన కృష్ణావతారంలో ఉన్నట్లు ఉంటుంది. ఒకప్పుడు రాముడు అన్నా.. కృష్ణుడు అన్నా సీనియర్ ఎన్టీఆర్ అనేవారు తెలుగోళ్లు. ఆయన ఆ సినిమాలతో అంత ఫేమ్ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొంతకాలం చిత్ర రంగాన్ని వీడలేదు ఆయన మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలతో తన దేశభక్తిని చాటుకున్నారు ఆయన.

    ఇవన్నీ పక్కన ఉంచితే ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఉన్న విగ్రహం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఏకంగా 54 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ విగ్రహాన్ని ఈ నెల (మే) 28న ఘనంగా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ జానియర్ ఎన్టీఆర్(తారక్)ను బుధవారం కలిశారు. విగ్రహ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేరు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పువ్వాడ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...

    NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. అప్పటికిదాకా ఆగాలా?

    NTR Devara : RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా...