40 C
India
Sunday, May 5, 2024
More

    Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ

    Date:

    • మాడ పగులగొడుతున్న సూరీడు
    • 45 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

      Weather Report
      Weather Report, summer tips
    Weather Report Today in Telugu states : తెలుగు రాష్ర్టాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో తీవ్రంగా వడగాలులు మండుతున్నాయి. తెలంగాణలో మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఎండల తీవ్రత కారణంగా బయటకు వెళ్లకపోవడమే మంచిదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ చెబుతున్నది. వడగాలుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. నీడనే ఉండి పనులు చేసుకోవాలని కూలీలు, ఇతర వర్కర్లకు సూచిస్తున్నారు.  అస్వస్థతకు గురైతే తక్షణమే వైద్యులను సంప్రదించాలని, ఉపశమనానికి అవసరమైన అన్ని అందుబాటులో ఉంచుకోవాలని కోరుతున్నారు.

    ఏపీలోనూ తీవ్ర ప్రతాపం..
    ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే మాడ పగిలే పరిస్థితి నెలకొంది. వృద్ధులు, బాలింతలు, చిన్నారులు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ సహా మిగతా పట్టణాల్లో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మధ్యాహ్నం వడగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇండ్లలో ఏసీలు, కూలర్ల ముందే పరిమితమవుతున్నారు.
    మరోవైపు పశువులు కూడా ప్రస్తుతం ఎండలకు అల్లాడుతున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో వడదెబ్బ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కారణంగా ప్రభుత్వం పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అడవుల్లో కూడా వన్యప్రాణులకు కూడా నీటి వసతి కల్పిస్తున్నది. ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలనే ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో ఐదుగురు మృతి

    Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో...