36.8 C
India
Tuesday, April 30, 2024
More

    MP Avinash Reddy అరెస్ట్ కు అంతా సిద్ధం.. కేంద్ర బలగాలు అందుకేనా..?

    Date:

    MP Avinash Reddy
    MP Avinash Reddy
    MP Avinash Reddy : వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్టుపై కడపలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణ నుంచి తప్పించుకున్న ఆయన ఇప్పుడు కడపకు చేరుకున్నారు. అంతకు ముందు కడప ఎస్పీని కలిసిన సీబీఐ అధికారులు అవినాశ్ అరెస్టుపై చర్చించారు. అవినాష్ అరెస్టుకు అవసరమైన పోలీస్ సహకారం కోరుతూ వారు మరోసారి ఎస్పీని కలిశారు.

    అయితే ఎస్పీ తన సానుకూల నిర్ణయాన్ని ఇంకా సీబీఐకి తెలియజేయలేదు. డీజీపీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఆయన సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కడపలో ఉన్న సీబీఐ అధికారులు నేడు అవినాష్ కు కేంద్ర బలగాల అండదండలను ఉపయోగించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా మీడియా కథనాల ప్రకారం సీఆర్పీఎఫ్ బెటాలియన్ కర్నూలుకు వెళ్తోంది. దీనికి కారణం హైదరాబాద్ జోన్ అధికారుల ఆదేశాలే. సాయంత్రం 6 గంటలకు బెటాలియన్ కర్నూలు చేరుకుంటుంది.

    సీఆర్పీఎఫ్ బలగాల సాయంతో అవినాశ్ ను సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అవినాశ్ తల్లి చికిత్స పొందుతున్న విశ్వభారతి హాస్పిటల్ కు వైసీపీ శ్రేణులు పోటెత్తుతున్నాయి. ఆయన కూడా ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నారు. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిజంగానే కేంద్ర బలగాల అండదండలతో అవినాశ్ ను అరెస్టు చేస్తే మరో ఏడాదిలోపే ఎన్నికలు జరుగుతుండడంతో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అవినాశ్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఇబ్బందికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అందరూ వైఎస్ జగన్ సొంత వారే కాబట్టి వారిపై పడిన ప్రభావం పార్టీ పై పడుతుందని అధినేతతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CPM: అంగన్వాడీల అరెస్ట్ అమానుషం…పోలీసుల తీరుపై మండిపడ్డ సిపియం రాష్ట్రా కమిటీ

    ఏపి.. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడి నాయకులతో పాటు వేలాది...

    BIG BOSS: పల్లవి ప్రశాంత్ పై క్రిమినల్ కేసు… అరెస్ట్ కు ప్రయత్నం.. ఉద్రిక్తత

        బిగ్ బాస్  సీజన్ 7  ప్రశాంత్ పై క్రిమినల్ కేసు నమోదు...

    Nandamuri Suhasini : మచ్చలేని చంద్రుడికి మరక అంటిస్తారా?

    Nandamuri Suhasini - Chandrababu's arrest : మచ్చలేని చంద్రుడికి మరక...

    Chandrababu Arrest : చంద్రబాబు కోసం కదిలిన జనం.. రోడ్డెక్కి బాసట..

    Chandrababu Arrest : చంద్రబాబు కోసం జనం రోడ్డెక్కారు. చంద్రబాబును అరెస్ట్...