35.8 C
India
Sunday, April 28, 2024
More

    Avinash Arrest : అవినాష్ అరెస్ట్ కు సీబీఐ ఏర్పాట్లు

    Date:

    Avinash Arrest
    Avinash Arrest

    Avinash Arrest : కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐ ఏర్పాట్లు చేసుకుంటున్నది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అవినాష్ ను ఇప్పటికే పలు మార్లు విచారించింది. అయితే ఇటీవల విచారణకు పిలిచిన మూడు సార్లు అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీనిని సీబీఐ సీరియస్ గా  తీసుకుంది. సీబీఐ కేంద్ర కార్యాలయం కూడా వెంటనే అవినాష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

    అవినాష్ రెడ్డి తల్లి గుండె సంబంధిత ఇబ్బందితో దవాఖానలో చేరింది.  అయితే తల్లిని కడప నుంచి కర్నూల్ కు తరలించడం కొన్ని అనుమాలకు తావిచ్చింది. అయితే పరిస్థితి విషమంగా ఉంటే, అటు హైదరాబాద్.. ఇటు బెంగళూరుకు కాకుండా కర్నూల్ లోని తనకు తెలిసిన దవాఖానలో ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా సీబీఐ అధికారులు రహస్యంగా ఆరా తీసినట్లు సమాచారం.  దీంతో వెంటనే హైదరాబాద్ నుంచి కర్నూల్  చేరుకున్న సీబీఐ బృందాలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఏ క్షణమైనా అవినాష్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించాలని సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిసింది.

    అయితే ఇప్పటికే అవినాష్ అరెస్ట్ కు సంబంధించి సమాచారం కర్నూల్ ఎస్పీకి సీబీఐ అందజేసింది. అరెస్ట్కు ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు అవినాష్ బెయిల్ అంశం గురువారం హైకోర్టులో చర్చకు రానుంది. దీంతో హైకోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినాష్ రెడ్డి అనుచరులు. వైసీపీ శ్రేణులు కూడా ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. అవినాష్ రెడ్డి పరిణామాలు ఎలా ఉంటాయోనని వైసీపీ అధిష్టానం అంచనా వేసుకుంటున్నది. మరోవైపు నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ల తిరస్కరణ- కస్టడీపై తీర్పు రిజర్వు చేసిన కోర్టు

    MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను సిబిఐ అరెస్టు...

    Dastagiri Petition : జగన్ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించoడి : సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్

    Dastagiri Petition : హైదరాబాద్: మాజీమంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్...

    CBI Investigation : తిరుపతి చంద్రగిరి – రైల్వే SSE, ADEE లంచం కేసులో సీబీఐ విచారణ

    CBI Investigation :  ఏపీ తిరుపతి:  రెండు రైల్వే జోన్‌లకు చెందిన ఇద్దరు...

    Deadline in Viveka’s murder case : వివేకా హత్య కేసులో ముగిసిన గడువు.. సీబీఐ తేల్చిందేమిటో..?

    Deadline in Viveka's murder case : కడపలో వైఎస్ వివేకానందరెడ్డి...