41.3 C
India
Saturday, May 4, 2024
More

    Bhimili : చివరి నిమిషంలో భీమిలిపై మనసు మార్చకున్న ఎన్టీఆర్.. ఎందుకంటే..

    Date:

    Bhimili
    Bhimili, NTR

    Bhimili : సినీ, రాజకీయ రంగాల్లో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన ఎన్టీఆర్ కు కొన్ని సెంటిమెంట్లు, కొన్ని ప్రాంతాల మీద ఎనలేని ప్రేమ ఉండేదని ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్నవాళ్లు చెబుతుంటారు. తన పూర్తి రాజకీయ జీవితంలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీఆర్ ఎనిమిదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు.

    ఒక్కచోటుకే పరిమితం కావొద్దని..
    ఎన్టీఆర్ 1983 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ రెండు మూడు అసెంబ్లీ  సీట్లలో పోటీ చేశారు. అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని నిరూపించడానికేనని అలా ఎంచుకునే వారని చెబుతుంటారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఓడిపోతానేమోననే అనుమానంతో అలా ఒక్క చోటనే కాకుండా మరో స్థానంలోనూ పోటీ చేస్తున్నారని విమర్శించేవారు.  అయితే అవేమి పట్టించుకొని ఎన్టీఆర్ చివరిసారిగా 1994 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో  రెండు స్థానాల్లోనూ పోటీ చేయాలనుకున్నారు. హిందూపురంతో పాటుగా సీటుగా ఉత్తరాంధ్రాలో ఏదో ఒక చోట పోటీయ చేయాలని భావించారు.
    అయితే భీమునిపట్నం నుంచి పోటీ చేయాలని ఎన్టీఆర్ చాలా ఆసక్తి చూపారు. అప్పటికే భీమిలీ నుంచి రెండు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి  చివరి నిమిషం దాకా భీ ఫారం ఇవ్వలేదని పార్టీలోని అప్పటి సీనియర్ నాయకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే భీమిలీ నుంచి పోటీ ఖాయమని అంతా అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆయన మనసు మాత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైపు మళ్లింది.
    ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన జిల్లా శ్రీకాకుళం. దీంతో అక్కడి నుంచి పోటీ చేయాలని భావించి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. దీంతో భీమిలీ నుంచి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే  ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ చేజారింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖ, భీమిలీపై చాలా ఆసక్తి చూపేవారు.

    భీమిలీలో అనేక కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.  విశాఖకు దీటుగా భీమిలిని తీర్చిదిద్దుతానని పలుమార్లు హామీలు కూడా ఇచ్చారు. భీమిలీ నుంచి పోటీ  చేసి ఉంటే ఈ పట్టణం దశ మరోలా ఉండేదని ఆ ప్రాంత వాసులు నెమరువేసుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త...

    Bhandaru Srinivasa Rao : జనవరి 18, ఈ తేదీ ప్రాధాన్యత గుర్తుందా! – భండారు శ్రీనివాసరావు

    Bhandaru Srinivasa Rao : ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి...

    Shobhan Babu : తన పాత్ర కంటే నా పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ.. రామారావును ఎన్నటికీ మరిచిపోలేను: శోభన్ బాబు

    Shobhan Babu : తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన నటుల్లో...

    NTR Death Anniversary : న్యూ జెర్సీలో ఎన్టీఆర్ వర్ధంతి..

    NTR Death Anniversary : శక పురుషుడు నందమూరి తారక రామారావు...