30.6 C
India
Tuesday, April 30, 2024
More

    Mass Leader : ఇక ‘చేతి’కి  చిక్కుతున్నారు.. చేతులెత్తేసిన మాస్ లీడర్

    Date:

    mass leader
    mass leader, Etela Rajender

    Mass leader : మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ రానున్నాయి. ఇప్పటికే రేపో,మాపో ముందస్తు రావచ్చుననే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది. సీఎం కేసీఆర్ ఏ క్షణాన్నైనా ముందస్తు కు వెళ్లొచ్చనే ఊహాగానాలు మొన్నటి వరకు నడిచాయి. ఇప్పడు కూడా అవే రూమర్లు ఉన్నా కేసీఆర్ రాజకీయ చాణక్యం ఎవరికీ అంతు చిక్కడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు.

    తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తన పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను సరిచేసుకుంటూనే ప్రత్యర్థి పార్టీల్లోని నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నది. అలాగే విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా అధికార పార్టీలోని అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి రావాలని కోరుతున్నాడు.   గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూడా ఇతర పార్టీల నాయకుల వైపు చూస్తున్నది.

    హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లలోని అసంతృప్తులను కమలం పార్టీలో చేర్చి కాషాయ కండువాలు కప్పాలని చూస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సక్సెస్ కావడం లేదు. చిన్నా చితకా లీడర్లే  తప్ప ఎమ్మెల్యే స్థాయి నేతలు చేరడం లేదు. ఈ విషయమై బీజేపీ పెద్దలు ఈటలతో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి బలమైన నేతలను బీజేపీ లో చేర్చాలని ఆ పార్టీ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు.

    కానీ ఈటల ప్రయత్నాలు మాత్రం అనుకున్న విధంగా సాగడం లేదు. బీఆర్ఎస్ ను వీడిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణావు తో ఈటల ఇప్పటికే పలుమార్లు భేటీలు వేశారు. రేపో, మాపో బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అదే సమయలో వారు కాంగ్రెస్ నేతతోనూ చర్చలు జరిపారు. ఇక వారు బీజేపీలో చేరే అవకాశాలు లేవనే తెలుస్తున్నాయి.

     మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  బీజేపీలో చేరడం కష్టమేనని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల అభిప్రాయపడ్డారు. సోమవారం తనను కలిసిన విలేకరులతో ఆయన  పిచ్చాపాటిగా మాట్లాడారు. తాను రోజూ పొంగులేటి, జూపల్లిలతో మాట్లాడుతున్నానని..  ఈ సందర్భంగా వారే తనకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు వారు కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా మాత్రం ఆపగలిగానన్నారు. భాజపాలో చేరేందుకు వారికి ఇబ్బందులు ఉన్నట్లు ఈటల తెలిపారు.
    ఇప్పటికీ ఖమ్మం.. కమ్యూనిస్టు ఐడియాలజీ ఉన్న జిల్లాగా పేర్కొన్నారు. ఆ జిల్లాలో కమ్యూనిస్టులు, తెలుగుదేశం సహా అన్ని పార్టీలూ ఉంటాయని.. కాంగ్రెస్‌ బలంగా ఉందని పేర్కొన్నారు. అయితే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అంతగా ఆసక్తి చూడం లేదని తెలుస్తున్నది.  ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీ కన్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఖమ్మంలో ఇప్పటికీ కమ్యూనిస్టులు తమ పట్టు నిలుపుకునే స్థితిలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరితో లాభం కన్నా నష్టమే ఎక్కువనే భావనలో ఆయా పార్టీల నేతలు ఉన్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Etela Rajender : ఈటల రాజేందర్ ఆస్తి రూ.54.01 కోట్లు

    Etela Rajender : మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజిగిరి బీజెపి ఎంపి...

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ బరిలో ఈటల నిలుస్తారా?

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది....

    Etela Rajender : పార్లమెంట్ కు ఈటల పోటీ.. ఎక్కడి నుంచో తెలుసా?

    Etela Rajender : తెలంగాణలో మోస్ట్ పాపులర్ పొలిటికల్ పర్సన్ ఈటల...

    Etala Rajender : ఇంతకీ ఈటల దారెటు! బీజేపీలో ఉంటాడా..? పోతాడా..?

    Etala Rajender : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేల రాజకీయాల్లో పెను మార్పులు...