36.8 C
India
Wednesday, May 8, 2024
More

    Rahul Gandhi In America: అమెరికాలో రాహుల్.. ఏం చేస్తున్నారంటే..

    Date:

    Rahul Gandhi In America
    Rahul Gandhi In America

    కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే బుధవారం ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రసంగించారు. అయితే ఇటీవల రాహుల్ గాంధీ తన ప్రసంగాలు, సమాధానాలు, వ్యవహారశైలితో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన ఎక్కువగా ప్రజలు, వివిధ వర్గాలతో మమేకమవుతున్నారు.

    అయితే రాహుల్ గాంధీ తాజాగా ఏం మాట్లాడరంటే కొన్నిరోజుల క్రితం తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ నుంచి వరకు చేపట్టిన జోడో యాత్రలో ఎన్నో వర్గాలను కలుసుకున్నట్లు చెప్పారు. దేశం మొత్తం బీజేపీ,  ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉందని తెలిపారు. కొన్ని వర్గాల చేతుల్లో ప్రజలు దగా పడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం ఆరు గంటలకు లేచి, రోజుకు 25  కిలోమీటర్లు నడిచేవాడినని ప్రజల కష్టాలే తనను నడిపించాయని చెప్పుకొచ్చారు. శ్రీనగర్లో తన పాదయాత్ర ముగిసిందని, ఇన్ని కిలో మీటర్లు నడిచానంటే, తానే నమ్మలేకపోయినట్లు తెలిపారు. తమకే అన్ని తెలుసనని అనుకుంటున్న వ్యక్తులు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ పక్కన దేవుడిని కూర్చోబెడితే అదేవుడికే పాఠాలు చెబుతారని విమర్శించారు. ఈ విశ్వం ఎలా పని చేస్తుందో కూడా ఆయనే చెబుతారని, అప్పుడు దేవుడే కంగారు పడుతాడని నేనేం సృష్టించానో అని అని వివరించారు. అయితే కొందరు నేతలు సైంటిస్టులకు సైన్స్, చరిత్రకారులకు చరిత్ర, సైనికులకు యుద్దం ఎలా చేయాలో వివరిస్తుంటారు. అయితే వారికి తమది మిడిమిడి ప్రవర్తన అని తెలియదని ఎద్దేవా చేశారు. ఎందుకంటే వారు ఏదీ వినరని, అందుకే ఏదీ అర్థం చేసుకోరని చెప్పారు. దేశం ఏ సిద్ధాంతాన్ని తిరస్కరించదని, అనేక విలువలతో దేశం ఉంటుందని చెప్పారు. ఆగ్రహం, విద్వేషం, దురహంకారం, నమ్మేవారైతే బీజేపీ సమావేశానికి వెళ్లేవారని పేర్కొన్నారు. మీరు నన్ను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పమంటున్నారు. బీజేపీలో అది కూడా ఉండదు.. కేవలం సమాధానాలే ఉంటాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్వేషం వంటి వాటిని కూడా పరిష్కరించలేకపోతున్నదని పేర్కొన్నారు. అయితే రాహుల్ ప్రసంగంలో బీజేపీ నేతల తీరును దుయ్యబట్టారు. మరి బీజేపీ నేతలు రాహుల్ భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular