34.1 C
India
Monday, April 29, 2024
More

    HomeNews Details MEGASTAR CHIRANJEEVI: దుమారం రేపిన చిరంజీవి రాజకీయ ప్రకటన

    Date:

    megastar-chiranjeevi-chiranjeevis-controversial-political-statement
    megastar-chiranjeevi-chiranjeevis-controversial-political-statement

    మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటన చేయడంతో అది పెద్ద దుమారంగా మారింది. ”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ  రాజకీయం నానుంచి దూరం కాలేదు ” ఈ డైలాగ్స్ చిరంజీవి సోషల్ మీడియాలో వదిలాడు. ఇంకేముంది అవి వైరల్ గా మారాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తానని అనుకుని భ్రమపడ్డాడు. కానీ ప్రజల ఆదరణ లేకపోవడంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యాడు.

    ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో రాష్ట్రం రెండుగా విభజింపబడింది. దాంతో పాటే ఆయన కేంద్ర మంత్రి పదవీకాలం కూడా అయిపొయింది. ఇక అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అలాగే మరోవైపు భారతీయ జనతా పార్టీ చిరంజీవిని రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేలా చేయాలని చూస్తున్నారు కానీ కుదరడం లేదు.

    కట్ చేస్తే చిరంజీవి వదిలిన డైలాగ్ ప్రకంపనలు సృష్టించింది. దాంతో మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడా ? అనే చర్చ మొదలయ్యింది. అయితే  అసలు విషయం ఏంటంటే …… గాడ్ ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందుతుంది. అందులో కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటాడు. మళ్ళీ తన సోదరికి కష్టాలు రావడంతో రాజకీయాల్లో అడుగు పెడతాడు. అదన్న మాట విషయం. 

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...