39.8 C
India
Thursday, May 9, 2024
More

    హిస్టరీ రిపీట్ : వరల్డ్ కప్ లో భారీ విజయాలు ఇవే..

    Date:

    ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలోనే అతి పెద్ద విజయం బుధవారం ఆస్ర్టేలియా నమోదు చేసింది. ఏకంగా 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై అలవోకగా గెలిచింది. ఈ మ్యాచులో ఆస్ర్టేలియా బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడారు. ముందుగా టాస్ గెలిచిన ఆస్ర్టేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో అదరగొట్టాడు.  ఆయనకు స్టీవ్ స్మిత్(71 పరుగులు), మార్నస్ లబుషేన్ (62 పరుగులు) కూడా జత కలిశారు. ఇక చివరలో బ్యాటింగ్ కు దిగిన గ్లెన్ మ్యాక్స్వెల్ (106 పరుగులు) రెచ్చిపోయాడు. 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఆస్ర్టేలియా జట్టు ఏకంగా 399 పరుగులు చేసింది.

    ఇక లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ విక్రమ్ జిత్ సింగ్ మాత్రమే కేవలం 25 పరుగులు చేశాడు. ఇంకెవరూ రాణించలేదు. దీంతో 309 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.  ఇది అత్యంత దారుణమైన ఓటమి కావడం గమనార్హం.

    ఇక గతంలో చూసుకుంటే వరల్డ్ కప్ లో భారీ విజయం రికార్డు కూడా ఆస్ర్టేలియా పేరిటనే ఉంది. 2015లో అప్గానిస్థాన్ మీద 275 పరుగుల తేడాతో ఆస్ర్టేలియా గెలిచింది. ఇక 2007లో బెర్ముడా జట్టు మీద భారత్ 257 పరుగుల తేడాతో గెలిచింది. అదేవిధంగా 2015లో విండీస్ జట్టు పై దక్షిణాఫ్రికా 257 పరుగుల తేడాతో గెలిచింది. 2003లో నమీబియా జట్టు పై ఆస్ర్టేలియా 256 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక 2007లో పసికూన బెర్ముడా జట్టుపై శ్రీలంక జట్టు 243 పరుగుల తేడాతో గెలిచింది. ఇక 2011లో నెదర్లాండ్స్ జట్టుపై దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    Share post:

    More like this
    Related

    Telangana : ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుతూ.. యువకుడి ఆత్మహత్య

    Telangana : ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతో ఫోన్ లో...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular