37.3 C
India
Thursday, May 9, 2024
More

    Balayya Vs Kodali Nani : ‘కొడాలి’పై బాలయ్య.. బాబు టార్గెట్ అదే!

    Date:

    Kodali Nani Vs Balayya
    Kodali Nani Vs Balayya

    Balayya Vs Kodali Nani : కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని. టీడీపీని, చంద్రబాబును దూషించేందుకే ఈయన రాజకీయాల్లో ఉన్నారా? ఆయన్ను అందుకు మాత్రమే జగన్ వాడుకుంటున్నాడా? అని జనాలకు పెద్ద అనుమానం. మంత్రి పదవిలో ఉన్నా, ఎమ్మెల్యే పదవిలో ఉన్నా, ఆయన  చేసిన అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో ఎవరికీ అర్థం కాదు. నోరుతెరిస్తే బూతులు, పరుషపదాలు, అహంకార మాటలు తప్ప వేరేరావు. రాజకీయాలను కంపు చేసిన వారిలో  ఈయనదే అగ్రస్థానం.

    కొడాలి నాని గుడివాడ ఎమ్మెల్యేగా 2004నుంచి వరుసగా గెలుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చూడాలని టీడీపీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొడాలి అహంకారానికి ఇక స్వస్తి పలుకాలని, ఆయన రాజకీయ జీవితానికి జనాలతోనే చరమగీతం పాడాలని భావిస్తున్నారు. కొడాలి దురుసు మాటల్లో చిన్నా, పెద్దా, మహిళలు..అనే ఇంగితం కూడా ఉండదు.. ఇలాంటి వాటికి తెరపడాలంటే ఆయన్ను ఓడించాల్సిందేనని ఫిక్స్ అయ్యారు.

    నోటిదూల ఎక్కువున్న కొడాలి నానిని దెబ్బకొట్టడానికి టీడీపీ అధినేత పెద్ద వ్యూహం రచిస్తున్నారని సమాచారం. గుడివాడ నుంచి బాలయ్యను పోటీ చేయించి.. కొడాలికి ఓటమి  రుచి చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై చంద్రబాబు చర్చలు చేస్తున్నట్టు సమాచారం. కాగా, గుడివాడ నియోజకవర్గ ఇన్ చార్జిగా వెనిగండ్ల రాము ఇప్పటికే అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బాలయ్యకు సపోర్ట్ చేసేవిధంగా చేయనున్నట్టు మీడియా వర్గాలు చెపుతున్నాయి.

    మరి బాలయ్య గుడివాడ నుంచి పోటీ చేస్తే హిందూపురం నుంచి ఎవరిని పోటీ చేయిస్తారు.. అనే సందేహాలు క్యాడర్ లో మెదులుతున్నాయి. అయితే లోకేశ్ ను మంగళగిరితో పాటు హిందూపురంలో కూడా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. రెండు చోట్ల పోటీ చేయిస్తే.. మంగళగిరిలో గెలవరనే భయంతోనే హిందూపురంలో కూడా పోటీ చేయిస్తున్నారని ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. లేదా ఇతర టీడీపీ ప్రముఖులను అయినా హిందూపురంలో పోటీ చేయించే అవకాశాలు ఉండొచ్చు. ఆ విషయం ఇప్పుడే చెప్పలేం. కానీ గుడివాడలో మాత్రం ఈసారి కొడాలి నానిపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ‘గుడివాడ’ నియోజకవర్గం నందమూరి కుటుంబానికి ఫ్యాన్ బేస్ బాగుంటుంది కాబట్టి.. అందులో బాలయ్య బరిలోకి దిగితే కొడాలి నానికి ఓటమి ఖాయమేనని విశ్లేషకులు చెపుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    YS Jagan : 15 నుంచి జగన్ లండన్ టూర్..! అందుకే అంటూ విమర్శలు..

    YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు,...

    Jagathi : నలభై ఏండ్ల వయసులో జగతి హాట్ ఫొటో షూట్స్

    Jagathi : జ్యోతి రాయ్ అనగానే చాలా మందికి తెలియక పోవచ్చు....

    Cash Seized : లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్

    Cash Seized : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....