32.2 C
India
Thursday, May 9, 2024
More

    Prashanthi Harathi : పెళ్లాం ఊరెళితే.. సినిమాలో సునీల్ భార్య ఇప్పుడెలా ఉందో చూశారా..? రీ ఎంట్రీకి రెడీ అంటోంది..

    Date:

    Prashanthi Harathi
    Prashanthi Harathi

    Prashanthi Harathi :  సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లకే కాదు సహాయక నటులకు కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. కొన్ని సినిమాల్లోని పాత్రలను ప్రేక్షకులు అసలు మరిచిపోరు. ఆ పాత్రలు అలాగే గుర్తుండిపోతాయి. ఆ పాత్రలతోనే కొందరు నటులు గుర్తుండిపోతారు కూడా. వారి పేరు గుర్తుకు రాకున్నా కానీ ఆ పాత్రల పేర్లతోనే వారిని గుర్తుంచుకుంటాం. ఇక తెలుగులో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. వీరిలో కొందరు భారీ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్లు కూడా ఉన్నారు.

    ఇక తన నటనతో అందరినీ అలరించిన ప్రశాంతి హారతికి మంచి గుర్తింపే ఉండేది. అసలు ఈ ప్రశాంతి హారతి ఎవరు అనుకుంటున్నారా? ఒకసారి ఆమె నటించిన సినిమాల గురించి చెబితే ఈజీగా గుర్తుకుతెచ్చుకుంటారు. ‘పెళ్లాం ఊరెళితే..’ సినిమా గుర్తుంది కాదా. ఇందులో సునీల్ భార్య అంటే ఠక్కున గుర్తుకు పట్టేస్తారు. ఈ సినిమాలో ఈమె సునీల్ ను గుడ్డిగా నమ్మే అమాయక భార్య పాత్రలో నటించింది. అంతకుముందు ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీలో ముస్లిం అమ్మాయిగా నటించింది.
    ఈ సినిమాలే కాకుండా ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్, రూపాయి వంటి సినిమాల్లోనూ కనిపించింది. కానీ పెళ్లాం ఊరెళితే సినిమా మంచి గుర్తింపు వచ్చింది. శ్రీకాంత్, వేణు, సంగీత, సునీల్, రక్షిత, ప్రశాంతి హారతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2003లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకు గానూ చిరంజీవి చేతుల మీదుగా ప్రశాంతి షీల్డ్ కూడా తీసుకుంది.

    పెళ్లాం ఊరెళితే.. సినిమా తర్వాత ప్రశాంతి బోలెడు అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడంతో భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. ఈమె నటే కాదు కూచిపూడి డ్యాన్సర్ కూడా. అందులో మాస్టర్స్ కూడా చేసింది. క్లాసికల్ డ్యాన్స్ ఫొటో షూట్స్, ప్రదర్శనలు ఇస్తున్న టైంలో ఆమెకు సినిమా చాన్స్ లు వరుసకట్టాయి. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యింది. అక్కడే డ్యాన్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేసింది.
    ఇన్నాళ్లు అమెరికాలో ఉన్న ప్రశాంతి.. తాజాగా తొలిసారి మీడియా ముందుకొచ్చింది. దాదాపు 20 ఏండ్ల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. అమెరికా వెళ్లిపోయినా తన మనసు మాత్రం సినిమాలపైనే ఉండేదని..ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారని.. అందరి లైఫ్ సెటిల్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు తనకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఉందని తన కోరికను బయటపెట్టింది. ఇక నుంచి హైదరాబాద్ లోనే ఉంటానని, అలాగే తన కూతురు తాన్య కూచిపూడి డ్యాన్సర్ అని.. వీఎన్ ఆదిత్య తెరకెక్కించిన తెలుగింటి సంస్కృతి అనే మ్యూజిక్ వీడియోలో నటించిందని తెలిపింది.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related