ఆట 18వ కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఫండ్ రైసింగ్ కార్యక్రమం అట్లాంటాలో ఘనంగా జరిగింది. సుమారు వెయ్యి మందికి పైగా ఇందులో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన తో కార్యక్ర మాన్ని ప్రారంబించారు. సాయంత్రం నృత్య సంగీతం, వినోదాత్మక కార్యక్రమాలతో అద్యతం ఉల్లాసభ రితంగా సాగింది. ఆట కన్వెన్షన్ డోనర్స్, స్పాన్సర్లు,కన్వెన్షన్ కోర్ టీం సభ్యులతోపాటు ఆయా కమిటీ చైర్మన్ కో.. చైర్మన్, అడ్వైజర్ నెంబర్లు పరిచయం ,సత్కార కార్యక్రమాలు సందడిగా జరిగాయి. అట్లాంటా తరఫున కన్వెన్షన్ కొరకు 1.45 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ గర్వించదగ్గ క్షణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆటో ప్రెసిడెంట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ కన్వెన్షన్ కొరకు అట్లాంటా చేపడుతున్న అద్భుత సన్నాహాలకు అనూహ్య నిధి సేకరణ కు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విశిష్ట అతిథి మిమిక్రీ రమేష్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు వివిధ ప్రణాళికలు ప్రతిపాధ నలు సందేశాలతో కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి కన్వెన్షన్ డైరెక్టర్ అనిల్ బొడ్డి రెడ్డి, ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీరామ్,కన్వెన్షన్ అడ్వైజర్ కమిటీ చైర్ పర్సన్ గౌతమ్ గోలి కన్వెన్షన్ అడ్వైజర్లు కరుణాకర్ అసిరెడ్డి వెంకట్ వీరనేని ప్రసంగాలు చేశారు.
Breaking News