Pawan Kalyan : రాజకీయ పార్టీ పెట్టడానికి తాను సొంత అన్నను కాదనుకుని బయటికి వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనను ఇబ్బంది పెట్టి వచ్చారని నాకు తెలుసు అన్నారు. ఆశయం కోసం నిలబడితే ముందు వెనుక చూడనని పవన్ కళ్యాణ్ అన్నారు.
నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తానని తక్కువ సీట్లు తీసుకున్నానని నేను అనుకోవట్లేదు అన్నారు. నా దృష్టిలో మూడు పార్టీలు 175 చోట్ల పోటీ చేస్తున్నట్లే అని ఆయన అన్నారు. ఈసారి వైసీపీలో పక్కన పెట్టకపోతే రాష్ట్రం తో పాటు దేశానికి హాని కలుగుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలు రసవతం గా మారబోతున్నాయి. టిడిపి తో పాటు జనసేన బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల రణరం గంలోకి దిగబోతున్నాయి. మరోవైపు అధికార వైసి పి కూడా మరోసారి గెలవాలని వ్యూహాలు రచిస్తోంది.