Lakshmi Parvathi : చంద్రబాబు, లోకేష్ ఉన్నంత కాలం జూ.ఎన్టీఆర్ ను టీడీపీలోకి రానివ్వరని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ఎలాగైతే నా మీద నిందలు వేసి తరిమివేశారో.. ఆ అబ్బాయిని కూడా ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారని.. ఎన్టీఆర్ తల్లిని కూడా తిడుతున్నారని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ బతికి బట్టాకట్టాలంటే చంద్రబాబు, లోకేష్ వల్ల కాదని.. జూ.ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు ఇవ్వాల్సిందేనని లక్ష్మీపార్వతి అన్నారు. దేశంలో అత్యధిక సీట్లు సాధించిన టీడీపీ ఇప్పుడు ఎలా తయారైందో చూడండని.. దిక్కుమొక్కు లేని పార్టీకి జూ.ఎన్టీఆర్ చేతికి ఇస్తేనే బాగుపడుతుందని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు.
లక్ష్మీపార్వతితో JAISWARAAJYA TV ఇంటర్వ్యూ వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.