
అభినవ దాన కర్ణుడిగా భారత ప్రజల చేత కీర్తించ బడుతున్న సోనూ సూద్ మరో చరిత్రకు శ్రీకారం చుట్టాడు. సైబర్ క్రైమ్ వల్ల దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు మోసపోతున్నారు. చదువుకున్న వాళ్ళు , చదువు లేని వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ సైబర్ మోసాలకు గురి అవుతున్నారు. దాంతో సైబర్ క్రైమ్ లను నివారించాలనే గొప్ప లక్ష్యంతో సైబర్ సెక్యూరిటీ కోసం ఓ సైన్యమే తయారు చేయాలని భావించాడు సోనూ సూద్ అందుకు నడుం బిగించాడు.
సైబర్ గీక్స్ ను తయారు చేయడానికి , వాళ్లకు తగిన శిక్షణ ఇవ్వడానికి అలాగే శిక్షణా కాలంలో స్కాలర్ షిప్ కూడా ఇవ్వడానికి రంగం సిద్ధం చేశాడు. అంతేకాదు సుశిక్షితులైన వారికి జాబ్ అవకాశం కూడా సోనూ సూద్ ఫౌండేషన్ ఇప్పిస్తుంది. ఇందుకోసం ఓ ప్రకటన విడుదల చేశారు సూద్ చారిటీ ఫౌండేషన్. కరోనా కష్టకాలంలో వలస జీవులకు మాత్రమే కాకుండా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆక్సిజన్ లను అలాగే మందులను అందించిన గొప్ప మానవతావాది సోనూ సూద్. ఇక ఇప్పుడేమో భారత్ ను సైబర్ నేరాల నుండి కాపాడటానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.
Big Opportunity for Cyber Geeks! 🤓
📚 Free Trainings
🎓 Free Scholarships for Certification
💻 Free Job Placement AssistanceApply Now!
Details on: https://t.co/juJL7Wk4oo
Let’s build a hacker free nation @SoodFoundation pic.twitter.com/6mi03ruo2P
— sonu sood (@SonuSood) February 1, 2023