జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చింది తెలంగాణ RTA. వారాహి అనే పేరుతో పవన్ కళ్యాణ్ ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. భారీ హంగులతో ఈ ప్రచార రథాన్ని స్పెషల్ గా చేయించారు పవన్. అయితే తెలంగాణలో రిజిస్ట్రేషన్ కోసం అప్లయ్ చేసుకోగా మోటార్ వాహనం నిబంధనలకు విరుద్దంగా ప్రచార రథం ఉందని దాంతో మార్పులు చేసి తీసుకువస్తే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేశారట.
తెలంగాణ ఆర్టీఏ అధికారులు ఈ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా ……. మొదట వాహనం రంగు. ఆలివ్ గ్రీన్ కలర్ ను కేవలం సైనిక వాహనాలకు మాత్రమే వాడతారు దాంతో ఆ కలర్ విషయంలో మార్పులు కోరారట. అలాగే లారీకి సంబంధించిన ఛాసిస్ నెంబర్ తో బస్సు రిజిస్ట్రేషన్ చేయమని కోరడం , వాహనం ఎత్తు ఎక్కవగా ఉండటం , మైన్స్ లో వాడే టైర్లను రోడ్ల పై వాడటంతో అభ్యంతరం. ఇలా వీటిని సవరించుకుంటే రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యంతరం లేదని చెప్పారట. ఇప్పటికే ఈ వాహనం పై వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఆర్టీఏ అభ్యంతరాలపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో చూడాలి.