Polio Drops : ఆంధ్రప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా మార్చి 3 వ తారీకు నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి కృష్ణ బాబు తెలిపా రు. 53.35 లక్షల మంది 5ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వన్ ఇయర్ పాటలు పూర్తి చేసామ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.
అంగన్వాడీలు గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లతో ANM లు సమన్వయం చేసుకో వాలని సూచించారు. ప్రజలలోకి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. పోలియో చుక్కలు వేయించ కపోతే భవిష్యత్తులో పిల్లలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించా లని అధికారులు తెలియజేశారు.