
16th September Horoscope : మేష రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇష్టమైన వారితో సంతోషంగా ఉంటారు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వ్రషభ రాశి వారికి చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. శుభ కార్యాలు చేపడతారు. మానసిక ఆందోళన లేకుండా పోతుంది. శివధ్యాన శ్లోకం చదవడం వల్ల బాగుంటుంది.
మిథున రాశి వారికి చేపట్టే పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ రంగాల్లో పోరాటం చేయడంతోనే విజయాలు దక్కుతాయి. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మంచి జరుగుతుంది.
కర్కాటక రాశి వారికి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈశ్వర అభిషేకం చేయడం మంచిది.
సింహ రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. పనుల్లో విజయాలు దక్కుతాయి. ముందుచూపుతో ప్రవర్తించాలి. మహావిష్ణువును పూజించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
కన్య రాశి వారికి చేపట్టే పనులు సునాయాసంగా పూర్తవుతాయి. మంచి కాలం. పెట్టుబడులు పెడితే లాభాలు దక్కుతాయి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
తుల రాశి వారికి ఆచితూచి అడుగేయాలి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. బుద్ధి చంచలంగా మారుతుంది. దీంతో ఇబ్బందులు వస్తాయి. ఈశ్వర దర్శనం చాలా మంచిది.
వ్రశ్చిక రాశి వారికి చేపట్టే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దుర్గాదేవి నామం జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి వారికి అనుకూల కాలం. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. గురు ధ్యానం చేయడం ఉత్తమం.
మకర రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెట్టాలి. మనోధైర్యం కలిగి ఉంటారు. ఆంజనేయ స్వామిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయి.
కుంభ రాశి వారికి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. శివారాధన చేయడం మంచిది.
మీన రాశి వారికి ఉద్యోగస్తులకు బాగుంది. ఆర్థిక లాభం కలుగుతుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దుర్గారాధన చేయడం శుభకరం.