
20th September Horoscope : మేష రాశి వారికి ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పనులు తొందరగా పూర్తి చేస్తారు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రశంసలు దక్కుతాయి. ఇష్టదేవతను పూజించడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
వ్రషభ రాశి వారికి మానసిక ఉత్సాహం రెట్టింపవుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. ఇష్టదేవతను ప్రార్థించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఎదురవుతాయి.
మిథున రాశి వారికి ఒక విషయం మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వెంకటేశ్వర ఆరాధన మంచి చేస్తుంది.
కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శని శ్లోకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
సింహ రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గ అష్టోత్తరం చదవడం మంచిది.
కన్య రాశి వారికి ముందు చూపుతో ఉండటం మంచిది. మంచి ఆలోచనలు వస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శివనామ స్మరణ చేయడం ఉత్తమం.
తుల రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి సాయం చేసే వారుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సూర్యాష్టకం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.
వ్రశ్చిక రాశి వారికి ముఖ్యమైన పనుల్లో సాయం అందుతుంది. ఒక శుభవార్త మీలో ఆనందం కలిగిస్తుంది. చేసే పనుల్లో జాగ్రత్తలు పాటించాలి. లక్ష్మీదేవి దర్శనం సంతోషం ఇస్తుంది.
ధనస్సు రాశి వారికి అనుకూల కాలం ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. గణపతి ఆరాధన సకల శుభాలు కలిగిస్తుంది.
మకర రాశి వారికి మీ నీతే మీకు అండగా నిలుస్తుంది. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. ప్రయాణాల్లో లాభాలున్నాయి. శ్రీరామ నామం జపించడం మంచిది.
కుంభ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. జాగ్రత్తలు పాటించాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం సురక్షితం.
మీన రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. శారీరక శ్రమ ఎక్కువ కావచ్చు. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదవడం శుభకరం.