37.8 C
India
Monday, April 29, 2024
More

    Deputy Mayor Sandhya Reddy : ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళకు అరుదైన గుర్తింపు

    Date:

    Deputy Mayor Sandhya Reddy :

    మన వారు ఇతర దేశాల్లో తమ సత్తా చాటుతున్నారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనా రిషి సునాక్ మన భారతీయుడే కావడం గమనార్హం. సింగపూర్ అధ్యక్షుడిగా మన భారతీయుడు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో కూడా మన వారు ఆధిపత్యం కనబరుస్తున్నారు. మన తెలంగాణ బిడ్డ అయిన సంధ్యారెడ్డి (శాండి రెడ్డి) ఆస్ట్రేలియాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ గా ఎన్నికై సంచలనం కలిగించింది.

    ఆమె ఎన్నికపై ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అభినందించారు. తెలంగాణ ముద్దుబిడ్డకు దక్కిన అరుదైన గౌరవంగా కొనియాడారు. సెప్టెంబర్ 5న జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ షెన్సబెన్ మేయర్ గా ఎన్నికయ్యారు. కౌన్సిలర్ గా గెలిచిన సంధ్యారెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం అందరిలో సంతోషం కలిగించింది.

    ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో శాండీ కౌల్సిలర్ గా గెలుపొంది డిప్యూటీ మేయర్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2020 సంవత్సరానికి స్ట్రాత్ ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కించుకుంది. ఇలా ఆమె అంచెలంచెలుగా ఎదగడంపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందునే ఆమెకు పదవులు వరిస్తున్నాయని కొనియాడారు.

    సంధ్యారెడ్డి పనితీరే ఆమెకు ప్రామాణికంగా నిలుస్తోంది. ప్రజల అవసరాలు తీర్చడంలో ఆమె చూపిస్తున్న చొరవే ఆమెకు ఇలాంటి అవకాశాలు తీసుకొస్తోంది. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రవాస భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. ఆస్ట్రేలియాలో సంధ్యారెడ్డి ప్రజలతో మమేకమై వారికి ఉత్తమ సేవలు అందించాలని కోరుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Australia Visa : ఆస్ట్రేలియా వీసా నిబంధనలు మరింత కఠిన తరం..! 

    Australia Visa : తమ దేశంలోకి వెల్లు వేతుతున్న వలసలులో నివారించేందుకు...

    AUSTRALIA: భారతీయులకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా

    భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టిషాక్ ఇచ్చింది.  వీసా అంశంలో నిబంధనలు కఠినతరం...

    World Cup 2023 : ఇక వరల్డ్ కప్ ఫీవర్.. ఆ ఐదు రికార్డులు బద్దలయ్యేనా..?

    World Cup 2023 : ఇక సరిగ్గా వారం రోజుల్లో వరల్డ్ కప్...