31 C
India
Monday, April 29, 2024
More

    AUSTRALIA: భారతీయులకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా

    Date:

    భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టిషాక్ ఇచ్చింది.  వీసా అంశంలో నిబంధనలు కఠినతరం చేస్తూ ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండేళ్లల్లో వలసలను సగానికి సగం తగ్గించేలా వీసా నిబంధనల్లో కీలక మార్పులకు సిద్ధమైంది. విదేశీ విద్యార్థులు, తక్కువ నైపుణ్యాలున్న విదేశీయులే టార్గెట్‌గా రూల్స్‌ను మరింత కఠినం చేసేందుకు నిర్ణయించింది. తాజాగా నిబంధనలు అమల్లోకి వస్తే ఇక విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా వీసా కోసం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ భాష పరీక్షలో మునుపటికంటే అధికమార్కులు సాధించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థుల వీసా కొనసాగింపుె వెసులుబాటును కూడా తగ్గించేందుకు సిద్ధమైంది. అయితే, అత్యధిక నైపుణ్యాలున్న వారికి వీసా పొందడం మరింత సరళతరం చేసేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. వారంలోపే దరఖాస్తు పరిశీలన పూర్తయ్యేలా ఓ కొత్త స్పెషలిస్టు వీసా అందుబాటు లోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ వీసా ద్వారా దేశంలోని వ్యాపార సంస్థలు సులభంగా విదేశీ నిపుణులను నియమించుకునేలా ఈ వీసాకు రూపకల్పన చేస్తోంది.

    గతేడాది గరిష్ఠంగా 510,000 మంది విదేశీయులు ఆస్ట్రేలియాకు వలసెళ్లారు. అయితే, వచ్చే రెండేళ్లల్లో ఈ సంఖ్య సగానికి పడిపోవచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. కఠిన వీసా నిబంధనలు ఇప్పటికే తమ ప్రభావం చూపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా అవసరాలకు తగినట్టు వలసల్లో సుస్థిరత సాధించడమే తమ లక్ష్యమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని ఆల్బనీస్ ఇటీవల వ్యాఖ్యానించారు. కుప్పకూలిన వలసల వ్యవస్థ బాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ విధానంలో సమతౌల్యం సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని వలసల శాఖ మంత్రి ఓనీల్ కూడా పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Australia Visa : ఆస్ట్రేలియా వీసా నిబంధనలు మరింత కఠిన తరం..! 

    Australia Visa : తమ దేశంలోకి వెల్లు వేతుతున్న వలసలులో నివారించేందుకు...

    Good News:అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్…వీసా రెన్యువల్ పై బైడెన్ కీలక నిర్ణయం

    ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లే వారికి బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. H-1B...

    USA : అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారుల్లో మన స్థానమేంటో తెలుసా?

    USA : మనదేశం నుంచి చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. అందులో...