
Adipurush 3D Version : రామాయణం నేపథ్యంతో భారీ స్థాయిలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’.. ఈ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడు రెండవ వారం లోకి అడుగు పెట్టింది.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
ఈ సినిమాను పాజిటివ్ వైబ్స్ తెచ్చి రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనకు ఆదిపురుష్ టీమ్ కు చుక్కులు కనిపించాయి. కనీసం డార్లింగ్ ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేక పోయాడు. దీంతో మొదటి షో తోనే మిశ్రమ స్పందన తెచ్చుకుని ప్లాప్ అని తేలిపోయింది. అయితే మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగా రాబట్టిన ఈ సినిమా వీక్ డేస్ లో గ్రాఫ్ మొత్తం పడిపోయింది.
4వ రోజు నుండి ఈ సినిమా వసూళ్లు ఎంత దారుణంగా పడిపోయాయంటే కోట్ల నుండి లక్షల్లో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను భారీ ధరకు దక్కించుకున్న బయ్యర్స్ కు చెమటలు పట్టాయి. రెండవ వీకెండ్ లో అయిన ఈ మూవీ కాస్త కలెక్షన్స్ మెరుగు పడతాయేమో అనుకుంటే కనీసం 5 కోట్లు కూడా రాబట్టలేక చతికల పడింది.
దీంతో ఈ సినిమా మొత్తం మీద 100 కోట్ల నష్టాలను తెచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితుల అంచనా.. ఈ సినిమాకు ఈ మాత్రం అయిన వసూళ్లు రావడానికి కారణం ఏంటో తెలుసా? 3D ఫార్మాట్.. దీని వల్లే ఎక్కువ వసూళ్లు వచ్చాయని 2D వర్షన్ లో చాలా తక్కువ కలెక్షన్స్ రాబట్టాయని టాక్.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుని రిలీజ్ చేయడంతో మూడు రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి.
ఈ సినిమాకు 390 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా అందులో 3D చార్జీల వల్లనే 50 కోట్ల రూపాయలు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి.. 3D వర్షన్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించగా దీని వల్లనే టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లారు. అదే 3D వర్షన్ లేకపోతే ఆ కలెక్షన్స్ కూడా వచ్చేవి కాదని అంటున్నారు..