Purandheshwari : ఏపీ సమస్యలపై బీజేపీ స్టాండ్ తీసుకుంటోంది. దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత కాస్త యాక్టివ్‌గా రాజకీయాలు చేస్తున్నారు. ఏపీ సమస్యలపై కుండబద్దలు కొడుతున్నారు.. ఆమె పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు. పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల వాణిని వినిపించడమే తన లక్ష్యమన్నారు.
బీజేపీ నాయకత్వం సూచించినట్లుగా నేను ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని పురంధేశ్వరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం హైకమాండ్‌కే వదిలేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతున్నదని ఆమె పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు వైఎస్ జగన్ చేసిందేమీ లేదని పురంధేశ్వరి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర రేఖ ఉందని, దానిని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తోందని ఆమె విమర్శించారు.