
Bezos alimony : ప్రపంచంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. వారు ఏ స్థాయిలో ఉన్నా విడిపోయేందుకే నిర్ణయించుకుంటున్నారు. కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుందంటారు. కానీ ఇలా ఎందుకు విడాకుల వరకు వెళ్తున్నారో వారికే తెలియదు. కలకాలం కలిసుండే బంధాన్ని కాదని విడిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు.
ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ (57) , ఆయన భార్య మెకంజీ (49) విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మెకంజీకి ఆమె భర్త భరణం రూ.38 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత ఖరీదైన భరణంగా నిలవనుంది. మన భారతీయ కరెన్సీలో రూ. 2.62 లక్షల కోట్లుగా తేల్చారు.
వీరికి సంబంధించిన విడాకుల ప్రక్రియ ఏప్రిల్ లోనే పూర్తయింది. ఇక వీరు విడిపోవడమే మిగిలింది. ఆర్థిక లావాదేవీలు పూర్తి కావడానికి 90 రోజులు పడుతుంది. ఈ గడువు ఈ వారంలో అయిపోతుంది. దీంతో వారిద్దరు విడిపోవడానికి మార్గం సుగమం కానుంది. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి.
ఇంత భారీ మొత్తంలో భరణం పొందడంతో ఆమె ప్రపంచంలోనే నాలుగో ధనవంతురాలిగా కొనసాగనుంది. బెజోస్ మాత్రం ధనవంతుడిగానే తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. మెకంజీ ప్రకటించిన విధంగా సమాజ సేవకే ఆ సంపద వినియోగించనుంది. 1993ల వీరు వివాహం చేసుకున్నారు. 1994లో అమెజాన్ సంస్థను స్థాపించారు. 26 ఏళ్ల ప్రస్థానంలో వీరి వైవాహిక జీవితం విడాకులతో ముగియడం గమనార్హం.
మొదటి భార్యకు విడాకులు ఇచ్చి తన ప్రేయసిని రెండో వివాహం చేసుకునేందుకు బెజోస్ సిద్ధమయ్యారు. దీనికి గాను ప్రేయసికి 20 క్యారెట్ల బంగారు ఉంగరంతో నిశ్చితార్థం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలా తన మొదటి వివాహాన్ని రద్దు చేసుకుని రెండో వివాహానికి రెడీ అవుతున్నారు.