30.2 C
India
Monday, May 6, 2024
More

    Anantapur Constituency Review : నియోజకవర్గ రివ్యూ : అనంతపురం లో గెలుపెవరిది..?

    Date:

    Anantapur Constituency Review : Who will win in Anantapur
    Anantapur Constituency Review : Who will win in Anantapur

    Anantapur Constituency Review :

    టీడీపీ :  ప్రభాకర్ చౌదరి
    వైసీపీ :  అనంత వెంకట్రామిరెడ్డి

    ఏపీ రాజకీయాల్లో అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అనంతపురం జిల్లా మొత్తం టీడీపీ కి కంచుకోటలా ఉన్నా, ఈ అర్బన్ కేంద్రం మాత్రం కాంగ్రెస్ కు అడ్డాగా ఉండేది.  రాష్ర్ట విభజన అనంతరం ఇక్కడ కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది. ఇక టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోరు మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ గెలిచింది. వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీలోనూ గ్రూపు విభేదాలు పెరిగాయి. ఇటు టీడీపీలో నూ ఇదే పరిస్థితి.

    అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. సుమారు 2లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో ముస్లింలు, బలిజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విజేతను నిర్ణయించేది కూడా వీరే కావడం గమనార్హం. అయితే ఇక్కడ గతంలో కంటే వైసీపీ బలంగా ఎదిగింది. ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా అనంత వెంకట్రామిరెడ్డి మారారు. ఇక నియోజకవర్గంలో కూడా ఆయన అభివృద్ధి పనులు చేశారనే పేరుంది. అయితే ఈసారి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఆహుడా ఛైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, చవ్వా రాజశేఖర్ రెడ్డి తో పాటు మరికొందరు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో గ్రూపు రాజకీయాలు పెరిగాయి.

    ఇక టీడీపీ విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నియోజకవర్గ ఇన్ చార్జిగానే ఉన్నారు. ఈయన 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. నగరంలో బలమైన నేతగా ఉన్నారు. అయితే ఇక్కడ జేసీ, చౌదరి వర్గాల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఇక్కడ ఈ ఇద్దరి గ్రూపులు లేకుంటే టీడీపీ కచ్చితంగా గెలుస్తుంది. అయితే ఈసారి గెలుపే లక్ష్యంగా ప్రభాకర్ చౌదరి ముందుకు సాగుతున్నారు.

    అయితే ఈసారి ఇక్కడ పోటీకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు టాక్ నడుస్తున్నది. ఇక్కడ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మద్దతు ఇస్తానని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రకటించారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...