34.1 C
India
Monday, April 29, 2024
More

    AP CID : మార్గదర్శి దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం

    Date:

    AP CID
    AP CID, Margadarshi

    AP CID : మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో ఏపీ సీఐడీ సీరియస్ గా అడుగులు వేస్తున్నది. మార్గదర్శి కేసును ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంది. సీఎం జగనే స్వయంగా దీనిని చూస్తున్నట్లు సమాచారం. అయితే సీఐడీ సోదాలపై మార్గదర్శి చేస్తున్న ప్రచారం పై కూడా న్యాయపరమైన చర్యలకు ఏపీ సీఐడీ సన్నద్ధమవుతున్నది. అర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ మార్గదర్శి చిట్ ఫండ్స్ పై సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నది.

    అయితే సీఐడీ దర్యాప్తు ను వక్రీకరిస్తూ మార్గదర్శి దుష్ర్పచారం చేస్తుండడాన్ని మార్గదర్శి సీరియస్ గా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగానే సంస్థ ఈ చర్యలకు దిగిందని అంతా భావిస్తున్నారు. తన అనుకూల మీడియా ద్వారా మార్గదర్శి యాజమాన్యం ఈ వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్లు గుర్తించింది.  దీని ద్వారా కేసును ప్రభావితం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.  దీంతోనే మార్గదర్శి సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వీరిద్దరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

    ఏపీలో ముందునుంచి ఈనాడు, ఈటీవీ తమ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే ఆయన కొంతకాలం సైలెంట్ గానే ఉన్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు బలంగా మారిన ఈ ఆయుధాలను తెంపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా ఈనాడు పత్రిక కు మూల స్తంభమైన మార్గదర్శి చిట్ ఫండ్స్ పై పెట్టారు. ఇక చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఏ వ్యవస్థ, వ్యక్తిని ఆయన వదిలిపెట్టాలనుకోవడం లేదు. తద్వారా బలమైన చంద్రబాబును కిందికి దించాలని చూస్తున్నారు.

    అయితే ఇందుకోసం ముందుగా రామోజీరావుపై దృష్టి పెట్టారు. ఇక తమను బద్నాం చేసి, డిపాజిట్ దారుల్లో కొంత భయాన్ని సృష్టించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు మార్గదర్శి చెబుతున్నది. ఇందుకు సీఐడీని వినియోగించుకుంటున్నదని ఆరోపిస్తున్నది. ఏదేమైనా ఇకముందు మరింత కఠినంగా మార్గదర్శిపై ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఇక ముందు ముందు ఇంకెన్నీ దాడులు కొనసాగుతాయో.. మరెన్ని కేసులు మార్గదర్శిపై పెడుతారో వేచి చూడాలి. మొత్తంగా అవినీతిని తేల్చి ప్రజల ముందు పెడుతారా.. కేవలం వేధింపులకు గురిచేసి, మార్గదర్శి తలొగ్గేలా చేసుకుంటారో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    AP CID Vs Chandrababu : చంద్రబాబుపై మరో కేసు పెట్టిన సీఐడీ

    AP CID Vs Chandrababu : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై...

    Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు షాక్..

    Chandrababu : చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్...

    Guntur CID office : గుంటూరు సిఐడి కార్యాలయానికి  మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక? 

    Guntur CID office : నేడు గుంటూరు జిల్లా సిఐడి కార్యాలయానికి...