Sharmila Arrest : అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను (YS Sharmila) పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా..
షర్మిల గురువారం పార్టీ కార్యకర్తలతో కలిసి సెక్రేటరియట్ ముట్టడికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను కొండవీటి ఎత్తిపోతల దగ్గర పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడం తో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని, మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌కి తర లించారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు.