Bro పవన్ కల్యాణ్ సినిమా అంటే క్రేజీ మామూలుగా ఉండదు. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో ది అవతార్ సినిమా వండర్ క్రియేట్ చేస్తోంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో రేపు నిర్వహించనున్నారు. దీంతో చాలా కాలం తరువాత పవన్ కల్యాణ్ సినిమా రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతున్నాయి. ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మధ్యాహ్నం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా అద్భుతమైన ట్రెండ్ కనబర్చడం విశేషం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇక్కడ నూతన శకం ప్రారంభిస్తుందని ఊహిస్తున్నారు. పవర్ స్టార్ అంటే మాటలు కాదు. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది మరి.
సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే పరేషాన్ అనిపిస్తుంది. ఇప్పటికే 30 మిలియన్ కిపైగా వ్యూస్ దక్కించుకున్నదంటే ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుందో తెలియడం లేదు. ట్రైలర్ కు 5 లక్షల 60 వేల లైకులు రావడం గమనార్హం. ఇక సినిమా ఎంత వండర్ సృష్టిస్తుందో తెలియడం లేదని సినిమా నిపుణులు చెబుతున్నారు.
బ్రో సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మరో మైలు రాయి కానుందని అంటున్నారు. ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా పవన్ కల్యాణ్ తన మేనల్లుడు తో కలిసి నటించడం ప్లస్ అయింది. మొదట ఈ పాత్ర కోసం నితిన్ ను అనుకున్నారట. కానీ పవన్ పట్టుబట్టి మరీ తన అల్లుడిని ఎంచుకున్నారట. అందుకే వారి ఇద్దరి కాంబినేషన్ కుదిరిందని చెబుతున్నారు.