36.8 C
India
Thursday, May 2, 2024
More

    BRS Behavior : బాబు అరెస్ట్ పై అలా.. ఎన్టీఆర్ పై ఇలా.. బీఆర్ఎస్ తీరును పరిశీలిస్తున్న ఆంధ్రా జనం..

    Date:

    BRS Behavior
    BRS Behavior, NTR Statue at Khammam

    BRS Behavior : చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం వెనుక ఆంధ్రా సమాజం గుర్రుగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం నడిపి తెలంగాణ సాధించుకొని కుర్చీ ఎక్కిన కేసీఆర్ సొంత రాష్ట్రం గురించి చూసుకోక ఆంధ్రా పొలిటికల్ లో వేలు పెడుతున్నారంటూ ఆంధ్రా సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

    ఒకప్పటి టీడీపీ నాయకుడు, పొరుగు రాష్ట్రం సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఇటీవల ఆయన కొడుకు కేటీఆర్ స్పందించి.. ‘ఆంధ్రాతో తమకేం సబంధం, అక్కడ టీడీపీ, వైసీపీల మధ్య గొడవ జరిగితే మేమెందుకు స్పందించాలి. ఆయన కోసం హైదరాబాద్ లో ధర్నాలు చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు. మీ రాష్ట్రానికి వెళ్లి ధర్నాలు చేసుకోండి’ అన్నారు.

    ఇటీవల  మంత్రి హరీశ్ రావు మాత్రం ‘అయ్యో’ అన్నారు గానీ అంతకు మించి మాట్లాడలేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ పై ఎవరైనా ( తన భావమరిదిని ఉద్దేశించి)  మాట్లాడితే అది పూర్తిగా వారి వ్యక్తిగతం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని సన్నాయి నొక్కులు నొక్కారు.

    ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరుణంలో మరో రాగం అందిపుచ్చుకున్నారు. ఖమ్మంలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మాకు రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. అందరినీ ఆయనలోనే చూశాం. తెలుగు వారి ప్రతిభను ఖండాంతరాల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్. మా నాన్న గారు కూడా ఆయన కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఆయనపై ఉన్న అభిమానంతోనే నాకు తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరే చాలా పవర్ ఫుల్’ అన్నాడు.

    త్వరలో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి. కాబట్టి ఈ సన్నాయి నొక్కులు అని అందరికీ అర్థం అవుతూనే ఉంది. ఈ పొగడ్తలు అన్నీ ఆంధ్రా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే అని అర్థమవుతుంది. పొరుగు రాష్ట్రాల రాజకీయాలతో తమకు సంబంధం లేదని చెప్పిన వారు అక్కడి రాజకీయాల్లో వేలు పెడుతూ ఎవరు సీఎం కావాలో.. వద్దో నిర్ణయిస్తుంటారు.

    బాబు అరెస్ట్ పై స్పందించాలని ఇప్పటి వరకు టీడీపీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ కేసీఆర్ ను కోరలేదు. కానీ మౌనం వహిస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి.. జగన్ కు తెలంగాణ సపోర్ట్ అనే కదా అర్థం వచ్చేది. బాహాటంగా చెప్తే ఎన్నికల్లో ఆంధ్రా ఓట్లు పోతాయని అనుకుంటున్న బీఆర్ఎస్ కు ఎలా బుద్ధి చెప్పాలో ఆంధ్ర జనంకు తెలుసని బాబు అభిమానులు, ఆంధ్రా పెద్దలు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IG Promotion List : ఐజీ ప్రమోషన్ల లిస్టులో తొలిపేరు ఆయనదే.. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకేనా?

    IG Promotion List : ‘‘వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర కూర్చున్నా...’’...

    Babu Jail Again : బాబును మళ్లీ జైలుకు పంపుతున్నారా?

    Babu Jail Again : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం...

    BRS Defeat : ఓటమి అంచుల్లో బీఆర్ఎస్.. అంగీకరించిన కేటీఆర్

    BRS Defeat : తెలంగాణలో కాంగ్రెస్ హవా పెరుగుతోంది. బీఆర్ఎస్ గాలి...

    Supreme Court Order : చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు.. సుప్రీంకోర్టు ఆదేశం

    Supreme Court order : ఏపీ సీఐడీ నమోదు చేసిన ఫైబర్...