Chaitu Second Marriage
Chaitu Second Marriage

Chaitu Second Marriage : అక్కినేని నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. వీరు పెళ్లి అయ్యాక ఎంతో అన్యోన్యంగా జీవించారు.. టాలీవుడ్ లోనే మోస్ట్ లవింగ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయి ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి.

నాలుగేళ్లకే మనస్పర్థల కారణంగా విడిపోయారు.. ఇక వీరి పెళ్లి ముగిసిన తర్వాత ఇద్దరు ఎవరికీ వారు కెరీర్ లో బిజీ అయ్యారు.. ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు అంటూ వీరు పెళ్లి చేసుకోనున్నారు అని కూడా రూమర్స్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఇందులో ఎలాంటి నిజం లేదని కూడా తెలిసింది.

దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇక నాగ చైతన్య కూడా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.. మళ్ళీ కొద్దీ రోజులకు ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా నాగ చైతన్య ఒక బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని టాక్..

ఇప్పటికే పెళ్లి మాటలు కూడా పూర్తి అయ్యాయని వార్తలు వస్తున్నాయి.. కానీ అక్కినేని కుటుంబం మాత్రం ఈ వార్తలపై స్పందించడం లేదు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.. ఇక నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా అతి త్వరలోనే స్టార్ట్ కానుంది.. ఈ సినిమాతో చైతూ మొదటిసారి పాన్ ఇండియన్ మూవీ చేయనున్నాడు