Congress Party : ఏ దేశంలో అయినా ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందే. అది చీటికి మాటికి కాకుండా మంచి విషయం కలిగి ఉండాలి. లేకపోతే అభాసుపాలు కావడం జరుగుతుంది. అధికార పక్షం తీరును తప్పుబట్టే పాయింట్లు పట్టుకుని లాగితే మంచి పేరు దక్కుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతిపక్షం పాత్ర సరిగా పోషించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్ష పార్టీ హోదా చూపించడం లేదు.
దేశంలో బీజేపీ హవా పెరుగుతోంది. కాంగ్రెస్ గాలి తగ్గుతోంది. రాహుల్ గాంధీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కలలు కంటున్నా ఆయనకు ఆ సత్తా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు పరాభవమే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జోడో యాత్రతో ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్నా కలిసి రావడం లేదు.
1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం కాంగ్రెస్ కు 403 సీట్లు వచ్చాయి. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ దిగజారిపోతోంది. ఏ రాష్ర్టంలో కూడా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పరాభవమే ఎదురైంది. ఒక్క తెలంగాణలో ప్రజలు అధికార మార్పు కోరుకున్నారు కాబట్టే అధికారం సాధించుకుంది. అది కూడా బీజేపీకి దక్కాల్సిన స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్ర సరిగా పోషించడం లేదు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టే పని చేయడం లేదు. ఏ పని చేసినా అందులో చిన్న పొరపాటైనా ఉంటుంది. దాన్ని గుర్తించి పోరాటం చేయాలి. కానీ కాంగ్రెస్ కు అంత సీన్ లేదు. ఏ నాయకుడు కూడా అధికార పార్టీని విమర్శించే బాధ్యత తీసుకోవడం లేదు. ఫలితంగా వారి ఉనికి ప్రమాదంలో పడుతోంది.