36.8 C
India
Thursday, May 2, 2024
More

    Be Careful If Covid Infected In This Waves : కొవిడ్ ఈ వేవ్ లో వైరస్ సోకిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి

    Date:

    Be Careful If Covid Infected In This Waves
    Be Careful If Covid Infected In This Waves

    Be Careful If Covid Infected In This Waves : ‘కొవిడ్-19’ ఈ పేరు వింటేనే సమస్త మానవజాతి ఉలిక్కిపడుతుంది. ఈ దేశం, ఆ దేశం.. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రపంచం యావత్తు కమ్ముకున్న ఈ వైరస్ సృష్టించిన మారణ హోమం మాటలకు అందనిది. తల్లిదండ్రులకు పిల్లలను, భార్యకు భర్తను ఇలా ఒకరు మరొకరిని కనీసం కడసారి చూపు దక్కకుండా చేసిన ఈ వైరస్ నిజంగా దారుణమనే చెప్పాలి.

    కొవిడ్ వచ్చిన తర్వాత కొంత మంది చనిపోగా మరికొందరు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. అందులో కొవిడ్ సెకండ్ వేవ్ చేసిన మారణహోమం ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. ఎటువంటి ధైర్యం కోల్పోక డాక్టర్లు వారి ప్రాణాలను అడ్డుపెట్టి మరీ చాలా మందిని వైరస్ నుంచి కాపాడగలిగారు. వేగంగా టీకాలను కనుకొన్న శాస్త్రవేత్తలు ఎక్కువ మందిని వైరస్ భారి నుంచి తప్పించారు. కానీ ఆఫ్టర్ కొవిడ్ ఎఫెక్ట్స్ నుంచి మాత్రం తప్పించలేకపోతున్నారు. కొవిడ్ తర్వాత ఫంగస్ అనీ.. ఇతర వ్యాధులు వ్యాపించి చాలా మంది మరణించారు. కొవిడ్ (కరోనా) వైరస్ కు తగ్గట్లుగా హ్యూమన్ బాడీలో ఇమ్యున్ సిద్ధమైంది. దాదాపుగా కరోనా వైరస్ జనావాసం నుంచి వెళ్లిపోయింది.. లేదా బాడీకి అలవాటైపోయింది.

    ఇవన్నీ కొంచెం పక్కన ఉంచితే ఈ మధ్య చాలా మంది యంగ్ జనరేషన్ గుండె జబ్బులతో మరణించడం లేదా ఇబ్బంది పడడం జరుగుతుంది. గుండెకు సంబంధించిన జబ్బులు అంటే కొవిడ్ కు ముందు ఎక్కువ మందిలో 60 సంవత్సరాల పైబడిన వారికే వచ్చేవి. కానీ కొవిడ్ తర్వాత వయస్సుతో సంబంధం లేకుండా యంగ్ జనరేషన్ కు వస్తుంది. పిట్టల్లా రాలిపోతున్నారు. దీనికి కారణాలు కొవిడ్ అంటూ ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ కూడా చెప్పారు.

    కొవిడ్ ఫస్ట్, సెకెండ్ వేవ్ లో ఎఫెక్ట్ అయిన వారికి గుండె సమస్యలు లేదా మరే ఆర్గాన్ సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే ఈ రెండు వేవ్స్ లో ఎఫెక్ట్ అయిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    COVID ALERT: రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ హెచ్చరిక

      దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చారి చేసింది. Jn.1...

    Cough and Cold : దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు ఎందుకు ఉంటోంది?

    Cough and Cold : కొవిడ్ సందర్భంలో మనం ఎన్ని సమస్యలు...

    long covid : ప్రతి పది మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్

    long covid : ఒమిక్రాన్ వేరియంట్ తరువాత కరోనా మహమ్మారి బారిన...

    కరోనా విజృంభణ :33 వేలకు చేరుకున్న కరోనా యాక్టివ్ కేసులు

    భారత్ లో కరోనా మళ్ళీ విలయాన్ని సృష్టిస్తోంది. ప్రతీ రోజు 6...