
Telangana Governor : తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ ఆమోదముద్ర వేశారు. ఇక తెలంగాణ నూతన గవర్నర్ గా రాధాకృష్ణన్ కు బాధ్యతలు అప్పగించారు.
జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణ న్ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ గానూ కొనసాగుతున్న తమిళిసై ఆ పదవికి కూడా రాజీ నామా చేయడంతో ఆ బాధ్యతలు కూడా సిపి రాధాకృష్ణన్ కి అప్పగించారు.
తమిళిసై రాజీనామాతో తెలంగాణ బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ అప్ప జెప్పంది. సిపి రాధాకృష్ణ న్ రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం కనబడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో అతి త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.