నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. అహంకారం, నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమ గీతం పాడారని గవర్నర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్యంసానకి గురయ్యా యని ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రజాస్వామ్య సృహలో పాలన జరుగుతోందని తెలంగాణ గవర్నర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురిఅయ్యారని గరన్నర్ తెలిపారు. గతంలో తెలంగాణలో పరిపాలన అన్నది సరిగ్గా జరగలేదని ఆమె అన్నారు..గత పాలనలో ప్రజలు చాలా ఇబ్బం దులు పడ్డారని ఆమె ఆరోపించారు. నేడు ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చుకున్నా రన్నారు. ప్రజలకు ఏమి అవసరమో వాటిని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె అన్నారు.
Breaking News