
Delhi CM : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అర వింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తుందని ఆయన తెలిపారు.
2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు అయిందని నాపై ఆరోపణలు లేకుండా అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన తెలిపారు. సీఎం వివరణ చెబు తుండగానే జడ్జి కావేరి భవేజా మీ వాదనలను రాతపూర్వకంగా ఇవ్వండి అని అడిగారు దీనికి స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ కాసేపు మాట్లా డడం ఇవ్వండి మేడం అని వాదనలు కొనసా గిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా అధికారులు ను ఈడి అధికారులు సుదీర్ఘంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం స్వయంగా తన వాదనలను తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు.