
DJ Tillu Heroine : టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఒక్క సినిమాతో పాపులర్ అయ్యి స్టార్ హీరోయిన్ అవుతారు అనుకునే లోపు వారి కెరీర్ యూటర్న్ తీసుకుని అవకాశాల కోసం వెతికే పొజిషన్ లో నిలబడుతున్నారు నేటి యంగ్ బ్యూటీలు.. మరి అలాంటి వారితో నేహా శెట్టి ఒకరు.. ఈమె డీజే టిల్లు సినిమాతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది..

ఈ సినిమా తర్వాత అమ్మడి ఫేమ్ ఎక్కడికో వెళ్లి పోయింది.. ఇక ఈమె ఆఫర్స్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదుగు తుంది అని భావించిన ఈమెకు నిరాశ తప్పలేదు. అడపాదడపా అవకాశాలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఆఫర్స్ అందుకోలేక పోతుంది.. కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది.
ముందుగా ఈమె పూరీ ఆకాష్ నటించిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వకపోయిన గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీకి డీజే టిల్లులో అవకాశం లభించింది.. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి రొమాన్స్ ఆడియెన్స్ ను బాగా అలరించింది.

అందుకే మొదటి సినిమా తోనే ఈమె కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది.. ప్రస్తుతం ఈ భామ కార్తికేయతో కలిసి బెదురులంక 2012 లో నటిస్తుంది.. అలాగే కన్నడలో కూడా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చీరలోను సెగలు పుట్టిస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తున్న ఈ భామ ఎద అందాలకు భారీ రెస్పాన్స్ లభిస్తుంది.