30.6 C
India
Tuesday, April 30, 2024
More

    BJP Bandi Sanjay Assets : తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్తులు ఎంతో తెలుసా..

    Date:

    BJP Bandi Sanjay Assets
    BJP Bandi Sanjay Assets

    BJP Bandi Sanjay Assets : తెలుగు రాష్ర్టాల ప్రజలకు బండి సంజయ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఆయన పేరు మార్మోగిపోయింది. అధికార పార్టీకి దీటుగా పార్టీకి ప్రజల్లో ఎంతో గుర్తింపు తెచ్చిన నేతగా బండి సంజయ్ పేరు తెచ్చుకున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ ను ఢీ అంటే ఢీ అనేలా పరిస్థితిని తీసుకొచ్చారు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని అధిష్టానం ఆయనను ఒక్కసారిగా ఆ పదవి నుంచి తొలగించింది. పలువురు సీనియర్ల డిమాండ్ మేరకే ఇలా జరిగిందని అంతా అనుకుంటున్నారు. ఇక బండి సంజయ్ తొలగింపు తర్వాత పార్టీ మరింత ఢీలా పడిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితం అవడం ఖాయంగా కనిపిస్తున్నది. సింగిల్ డిజిట్ మార్క్ దాటే పరిస్థితి కనిపించడం లేదు.

    ఇక అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాక, ఆయనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. పలు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇక కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. దీంతో సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా  ఒక్కక చాన్స్ ఇస్తే కరీంనగర్ నియోజకవర్గాన్ని అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తానని ప్రజలను ఆయన కోరుతున్నారు. కరీంనగర్ లో బీజేపీ జెండా ఎగరాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కార్యక్రమానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు.

    ఇక నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో ఆయన పలు విషయాలు పొందుపరిచారు. తనపై 30 కేసులువిచారణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక 79.51 లక్షల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక తన అప్పులు 5.44 లక్షలు, తన భార్యకు రూ.12.40 లక్షల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక కుటుంబ సభ్యుల పేరిట ఎక్కడా భూములు లేవని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    Poll Tracker Survey : తెలంగాణలో ఆ పార్టీకి మూడో స్థానమే..తాజా సర్వే సంచలనం

    Poll Tracker Survey : దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి పెరిగింది....

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ బరిలో ఈటల నిలుస్తారా?

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది....