36.9 C
India
Tuesday, April 21, 2026
More

    నాటు నాటుకు ఆస్కార్ అంత రేజ్ ఉందా..? కీరవాణికి ఆర్జీవీ సూటి ప్రశ్న

    Date:

    M-M-Keeravani-ram-gopal-varma
    M-M-Keeravani-ram-gopal-varma

    బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరు డైరెక్టర్లు ఒక వైపు అయితే రాంగోపాల్ వర్మ మరో వైపు. ఆయన ఏం చేసినా చెల్లుతుంది. ఎవరినీ పట్టించుకోకుండా మాట్లాడడం, మనసులో ఏది ఉంటే అది కక్కేయడం ఆయనకే చెల్లుతుంది. బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ అంత రేంజ్ ఉన్న డైరెక్టర్ సాధారణ ఒక హోస్ట్ కాళ్లకు బానిసయ్యాడు. అయినా వర్మ మీద ఎవ్వరికీ క్రేజ్ తగ్గలేదు. ఆయన నుంచి డీ-కంపెనీ, సర్కార్, క్షణ క్షణం, రక్తచరిత్ర కోరుకునే వాళ్లు ఇంకా ఉన్నారు. ఆయన దర్శకత్వ ప్రతిభకు ఆకాశం కూడా హద్దు కాదేమో అనిపిస్తుంది.

    వర్మ రీసెంట్ గా ‘నిజం’ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. ఇందులో ప్రముఖులతో పాటు సినీ ఇండస్ట్రీలో దిగ్గజాలతో ఇంటర్వ్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ ఎపీసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ఛానల్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ కీరవాణిదే అని తెలుస్తోంది. ‘ఆస్కార్ వెనుక నాటు నిజం’ అని ఎపీసోడ్ ప్రమోకట్ చేశారు. ఈ ఎపీసోడ్ లో ఆర్జీవి కీరవాణిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నాటు నాటుకు ఆస్కార్ అర్హత ఉందని మీరు అనుకుంటున్నారా..? అన్న ప్రశ్నకు కీరవాణి స్పందిస్తూ.. ఆస్కార్ రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. కేవలం పాటగానే తీసుకుంటే ఆస్కార్ వచ్చినందుకు ఫీలవ్వను. జయహో పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు నేను ఫీలవ్వలేదు అంటూ బదులిచ్చాడు.

    దీంతో పాటు నాటు నాటు సాంగ్ మీ కెరీర్ లో టాప్ 100 సాంగ్స్ లో ఉందని ఫీల్ అవుతున్నారా..? అని ప్రశ్నించగా ఏదైనా సాంగ్ లేదా పని చేసేప్పుడు అవతలి వారికి నచ్చాలి అనుకుంటాం ఇది కామనే.. కానీ అది నీకు నచ్చితేనే అవతలి వారికి నచ్చుతుందని గ్రహించాలి. ఇక అది మనకే నచ్చకుంటే ప్రపంచానికి ఎలా నచ్చుతుంది. అందుకే ఈ పాట నా కెరీర్ లో నిలిచిపోతుంది అని కీరవాణి బదులిచ్చాడు.

    ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. దర్శకుడు జక్కన్న చెక్కిన ఈ సినిమా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఇందులో ‘నాటు నాటు’ సాంగ్ కు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. ఈ అవార్డును గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898AD : ఆస్కార్ రేసులో ప్రభాస్ కల్కి 2898AD

    Kalki 2898AD : సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఆస్కార్...

    Kamalaharis : కమలాహారిస్ ప్రచారం.. అమెరికాలో ‘నాటునాటు’ పాట

    Kamalaharis : అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మన పాట...

    Keeravani : ప్రపంచ గుర్తింపు.. టాప్ 50 భారతీయుల్లో చంద్రబోస్, కీరవాణి

    Keeravani : ప్రపంచ గుర్తించిన టాప్ 50 భారతీయుల్లో చంద్రబోస్-కీరవాణిలకు చోటు...