30.1 C
India
Sunday, April 19, 2026
More

    కవితకు షాకివ్వనున్న ఈడీ.. పక్కా ఆధారాలతో దూకుడు

    Date:

    ED again serves notices to MLC Kavitha
    ED again serves notices to MLC Kavitha
    ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూప్ పాత్ర, అందులో ఎమ్మెల్సీ కవితపై పాత్రపై ఈడీ విచారణ మరింత ముమ్మరం చేసింది. ఈ స్కాంలో వచ్చిన డబ్బులను మరో ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసినట్లు ఈడీ పక్కా ఆధారాలు సేకరిస్తుంది. లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బులతోనే ఎమ్మెల్సీ కుటుంబ సభ్యుడు ఆమె భర్త అనిల్ ఫీనిక్స్ సంస్థ పేరుతో వట్టినాగులపల్లి వద్ద భూములు కొన్నారని అనుమానిస్తుంది. దీని వెనుక ప్రధాన పాత్రధారి కవిత అనే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగా ఫీనిక్స్ సంస్థ నుంచి ఎన్ గ్రోత్ కేపిటల్ పేరుతో కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో కవిత భర్త అనిల్ పేరును ఈడీ చార్జిషీట్ లో ప్రస్తావించింది.

    స్కాంలో ఇరుక్కొని విచారణ ఎదుర్కొంటున్న కవిత తనపై కాకుండా తన భర్తపై భూములు కొనుగోలు చేసినట్లు ఈడీ భావిస్తోంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఫీనిక్స్ సంస్థ తరుఫున చాలా డబ్బు రియల్ ఎస్టేట్ లో పెట్టారు. అంత డబ్బు అనిల్ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చిందని కూపీలాగే పనిలో పడింది ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. అయితే లిక్కర్ స్కాంతో నేరుగా సంబంధం లేకపోయినా భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్న వారి ఆస్తులను కూడా ఆరా తీయాలను ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఆర్థిక లావాదేవీల విషయంలో క్రియేటివ్ డెవలపర్స్ యజమాని శ్రీహరిపై కూడా ఈడీ దృష్టి పెట్టింది. గత సంవత్సరం ఏప్రిల్, మేలో పిళ్లయ్ ఖాతా నుంచి శ్రీహరికి మూడు విడుతల్లో దాదాపు రూ. 5కోట్లకు పైగా మళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా ఈడీ దర్యాప్తు చేయనుంది. అయితే అరుణ్ పిళ్లయ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీహరి, పిళ్లయ్ ని వేర్వేరుగా విచారణ చేయగా వారు ఇవే వ్యాఖ్యలు చేశారు.

    పిళ్లయ్, కవిత, ఆమె భర్త అనిల్, సునీల్ ఇలా కవిత వ్యాపార లావీదేవీల్లో స్వయంగా, భాగస్వామ్యంగా ఉన్న అందరిపై ఈడీ దృష్టి  సారించింది. దీంతో కవిత కుటుంబంలో అలజడి మొదలైంది. కవిత లిక్కర్ స్కాం డబ్బులను మరో చోట ఇన్వెస్ట్ చేసిందని పక్కా ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్తున్నా వాటిని బయట పెట్టడం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kavitha : కవిత కొత్త పార్టీ: జగన్ మాస్టర్ మైండ్, కేసీఆర్ వ్యూహం?

    Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది....

    Kavitha : తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి?: కవిత

    Kavitha : 'జయజయహే తెలంగాణ'ను రాష్ట్ర గీతంగా గుర్తించడం సంతోషకరమని శాసనమండలిలో బీఆర్ఎస్...

    Kavitha : బెయిల్ పై బయటకు వచ్చిన కవిత ఎందుకు సైలెంట్ అయ్యింది.. ఆ పార్టీ నుంచి హెచ్చరికలు అందాయా?

    MLC Kavitha : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సుప్రీంకోర్టు బెయిల్...

    Kavitha : కవితకు బెయిల్.. ఇంతకీ ఎవరు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు?

    Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...