
YCP Final List : ఆంధ్రప్రదేశ్లో వైసిపి రెండు దశల్లో 35 అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను మార్పులు చేసింది. ఇవాళ సాయంత్రం పలువురు ఎమ్మెల్యేలు కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం కానట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఫైనల్ లిస్టు ఖరారు చేసి ఈ వారంలోని విడుదల చేయను న్నట్లు సమాచారం అందుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై అధిష్టానం ఫోకస్ చేయనుంది. గత కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుతో వైసీపీలో కలవరం మొదలైంది.
ఎంతో సీనియార్టి ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో సీటు రాకపోవడంతో పలువురు వైసిపి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసి గతంలో అధికారంలోకి రావడానికి దోహ దపడిన తమను ఇప్పుడు కరివేపాకుల తీసివే యడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు సర్వేల ప్రకారమే అభ్యర్థులు ఎంపికలు చేస్తున్నామని ఇప్పటికే స్పష్టం చేశారు.
సర్వేల ప్రకారం అభ్యర్థులను మారుస్తున్న సీఎం జగన్ మార్పు చేసిన నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఏ బాధ్యతలు చెబుతారన్న విషయంపై క్లారిటీ లేదు. దీంతో తమను పూర్తిగా పార్టీ పక్కన పెట్టేసిందన్న ఆలోచనతో ప్రస్తుత ఎమ్మెల్యే లు ఇతర పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుతో వైసీపీ పతనం మొదలైందని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.